Prakash Raj on Manchu Vishnu: మంచు విష్ణు హామీలపై గెలిపించిన పెద్దలే అడగాలి - ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్
Prakash Raj on Manchu Vishnu: తాము గెలిచామా? ఓడిపోయామా? అన్నది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణుకు ఓటేసిన పెద్దలు ఆలోచించుకోవాలని ప్రకాష్ రాజ్ అన్నాడు. విష్ణు ఇచ్చిన హామీల గురించి అతడిని గెలిపించిన పెద్దలే అడగాలని పేర్కొన్నాడు. ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
Prakash Raj on Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ఇచ్చిన హామీలపై ప్రకాష్ రాజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మా ఎన్నికల్లో విష్ణుకు ఓటు వేసిన వారే ఓడిపోయారని ప్రకాష్ రాజ్ అన్నాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం సొంతంగా బిల్డింగ్ కట్టిస్తానని విష్ణు ఇచ్చిన హామీలపై ప్రకాష్ రాజ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. విష్ణు ఇచ్చిన హమీలు గురించి దొంగ ఓట్లు వేసిన వాళ్లు అడగలేరు. వాళ్లకు నోరు ఉండదు.
ఈ ఎన్నికల కోసమే ఫ్లైట్లలో వచ్చిన వాళ్లకు బిల్డింగ్‌తో సంబంధం ఉండదు. విష్ణును గెలిపించిన పెద్దలే హామీల గురించి అతడిని అడగాలి. విష్ణును గెలిపించి ప్రకాష్ రాజ్‌ను ఓడించినందుకు ఏం అభివృద్ధి జరిగిందన్నది తమ మనఃసాక్షిని వాళ్లైన ప్రశ్నించుకోవాలని ప్రకాష్ రాజ్ పేర్కొన్నాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎవరూ ఓడిపోయారు...ఎవరూ గెలిచారు అన్నది కాకుండా ఓటు వేసిన వాళ్లు తాము ఓడిపోయామా? గెలిచామా? అన్నది ఆలోచించుకోవాలని ప్రకాష్ చెప్పాడు.
నెక్స్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో తనకు పోటీ చేసే ఆలోచన లేదని తెలిపాడు. మా ప్రెసిడెంట్ మంచు విష్ణును ఉద్దేశించి ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
రెండేళ్ల క్రితం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్‌ను ఓడించి మంచు విష్ణు ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. మంచు విష్ణు ప్యానల్ పదవీ కాలం ఇటీవలే ముగిసింది. ఆ పదవీ కాలాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పెంచారు. మళ్లీ వచ్చే ఏడాది మా ఎన్నికలు జరుగనున్నాయి.
టాపిక్