Pragya Jaiswal: బాలకృష్ణతో ఏజ్ గ్యాప్‍ విషయంపై రియాక్ట్ అయిన ప్రగ్యా జైస్వాల్.. ఏమన్నారంటే..-pragya jaiswal responded on age gap matter with balakrishna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pragya Jaiswal: బాలకృష్ణతో ఏజ్ గ్యాప్‍ విషయంపై రియాక్ట్ అయిన ప్రగ్యా జైస్వాల్.. ఏమన్నారంటే..

Pragya Jaiswal: బాలకృష్ణతో ఏజ్ గ్యాప్‍ విషయంపై రియాక్ట్ అయిన ప్రగ్యా జైస్వాల్.. ఏమన్నారంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 29, 2025 11:06 AM IST

Pragya Jaiswal: బాలకృష్ణతో ప్రగ్యా జైస్వాల్ రెండు చిత్రాల్లో కలిసి నటించారు. అయితే, ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉందని, ఇది సరి కాదంటూ కొందరు విమర్శించారు. ఈ విషయంపై ప్రగ్యా ఇప్పుడ స్పందించారు. ఏమన్నారంటే..

Pragya Jaiswal: బాలకృష్ణతో ఏజ్ గ్యాప్‍ విషయంపై రియాక్ట్ అయిన ప్రగ్యా జైస్వాల్.. ఏమన్నారంటే..
Pragya Jaiswal: బాలకృష్ణతో ఏజ్ గ్యాప్‍ విషయంపై రియాక్ట్ అయిన ప్రగ్యా జైస్వాల్.. ఏమన్నారంటే..

నట సింహం నందమూరి బాలకృష్ణకు జోడీగా రెండు చిత్రాల్లో హీరోయిన్‍గా నటించారు ప్రగ్యా జైస్వాల్. బ్లాక్‍బస్టర్ అఖండతో పాటు ఈనెలలోనే వచ్చి సూపర్ హిట్ అయిన డాకు మహారాజ్ మూవీలో బాలయ్యకు జోడీగా కనిపించారు. అయితే, ఇద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉందని, కలిసి హీరోహీరోయిన్లుగా నటించడం ఏంటి అని కొందరి నుంచి విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగ్యా జైస్వాల్ స్పందించారు.

yearly horoscope entry point

బాలయ్యతో కలిసి నటించడం గురించి..

2021లో అఖండ తర్వాత మళ్లీ డాకు మహారాజ్ చిత్రంలో బాలకృష్ణతో కలిసి నటించారు ప్రగ్యా. ఆయనతో పని చేసిన అనుభవాన్ని ఆమె పంచుకున్నారు. బాలయ్యతో కలిసి నటించడం స్వచ్ఛమైన ఆనందాన్ని ఇస్తుందని, పాజిటివిటీ అని ప్రగ్యా అన్నారు.

బాలయ్య నుంచి నేర్చుకునేందుకు చాలా ఉందని ప్రగ్యా జైస్వాల్ చెప్పారు. “కెమెరా ఆన్, ఆఫ్ మధ్యలో సులభంగా ఎలా మారొచ్చో ఆయన లాంటి లెజెండ్ దగ్గర చాలా నేర్చుకోవచ్చు. ఆయనకు ఎలాంటి ఫిల్టర్స్ ఉండవు. చాలా గౌరవంగా ఉంటారు. అందరినీ సమానంగా చూస్తారు. మొత్తంగా బాలయ్య చాలా మంచి వ్యక్తి. చాలా సహకారం అందించే నటుడు” అని ప్రగ్యా చెప్పారు.

ఏజ్ గ్యాప్ విషయంలో..

బాలకృష్ణ వయసు ప్రస్తుతం 64 ఏళ్లు కాగా.. ప్రగ్యా జైస్వాల్‍కు 37. ఇద్దరి మధ్య సుమారు 27ఏళ్ల గ్యాప్ ఉంది. దీనిపైనే కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది పెద్ద విషయం కాదని ప్రగ్యా అన్నారు. స్క్రీన్ మీద బాగా కనిపిస్తే చాలు అని చెప్పారు. “పాత్రను ఎలా రాశారన్న దానిపై నటీనటులను తీసుకుంటారని నేను అనుకుంటా. పాత్రకు న్యాయం చేయగలిగితే.. స్క్రీన్‍పై బాగా కనిపిస్తే చాలు. ఇక ఏజ్ గ్యాప్‍ను పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది?” అని ప్రగ్యా జైస్వాల్ అన్నారు.

అఖండలో తాము భార్యభర్త పాత్రలు పోషించామని, ఆడియన్స్ మెచ్చారని ప్రగ్యా చెప్పారు. “మేం అఖండ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు.. ఎలా కనిపిస్తామో అని అనుకున్నాం. కానీ షూటింగ్ చాలా బాగా జరిగింది. మమ్మల్ని భార్యభర్తలని ప్రేక్షకులు నిజంగానే అనుకున్నారు. స్టోరీకి, పాత్రకు న్యాయం చేసినప్పుడు.. ఇక దాని గురించి ఏ విషయంలో మాట్లాడేందుకు ఏమీ ఉండదు” అని ప్రగ్యా చెప్పారు. ఏజ్ గ్యాప్ పెద్ద విషయమే కాదని స్పష్టం చేశారు.

ఏడాదికి ఆరంభం అదుర్స్

ఈ ఏడాది తనకు డాకు మహారాజ్‍తో అద్భుతమైన ఆరంభం దక్కిందని ప్రగ్యా చెప్పారు. డాకు మహారాజ్ చిత్రం రూ.150కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుందని మూవీ టీమ్ వెల్లడించింది. “ఈ ఏడాది మంచి బ్యాంగ్‍తో మొదలైంది. ఇంత కంటే ఏం కావాలి. డాకు మహారాజ్ సంక్రాంతి సందర్భంగా రిలీజైంది. విడుదల రోజే (జనవరి 12) నా పుట్టిన రోజు. ఈ సినిమాపై కురుస్తున్న ప్రేమను నేను ఎంజాయ్ చేస్తున్నా. నేను చేసిన కావేరి రోల్‍పై చాలా మంది ప్రేమను కురిపిస్తున్నారు” అని ప్రగ్యా అన్నారు.

తనను చాలా మంది డాకు మహారాణి అంటున్నారని ప్రగ్యా చెప్పారు. గర్భిణిగా నటించడం తనకు చాలా కొత్తగా అనిపించిందని అన్నారు. ఈ చిత్రంలో తన పాత్ర చాలా శక్తివంతంగా సాగిందని తెలిపారు.

డాకు మహారాజ్ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలకృష్ణ స్టైలిష్ యాక్షన్‍తో అదరగొట్టారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లు ప్రొడ్యూజ్ చేశాయి.

Whats_app_banner

సంబంధిత కథనం