Pragya Jaiswal: హీరోయిన్ బర్త్ డే రోజున బాలకృష్ణ మూవీ రిలీజ్- ఆ డైరెక్టర్స్ సినిమాల్లో నటించాలని ఉందన్న ప్రగ్యా జైస్వాల్
Pragya Jaiswal About Daaku Maharaaj Releasing On Her Birthday: అఖండ సినిమాతో హీరోయిన్‌గా మంచి హిట్ అందుకున్న ప్రగ్యా జైస్వాల్ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. బాలకృష్ణ యాక్ట్ చేసిన డాకు మహారాజ్ ప్రగ్యా జైస్వాల్ పుట్టినరోజున రిలీజ్ కానుంది. దీనిపై ప్రగ్యా జైస్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Pragya Jaiswal About Daaku Maharaaj Releasing On Her Birthday: కంచె సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన ప్రగ్యా జైస్వాల్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత చాలా కాలం తర్వాత బాలకృష్ణ అఖండ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు మరోసారి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించిన సినిమా డాకు మహారాజ్.
బాబీ కొల్లి దర్శకత్వం వహించిన డాకు మహారాజ్ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌తోపాటు మరో హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. ప్రగ్యా జైస్వాల్ పుట్టిన రోజు అయిన జనవరి 12న సంక్రాంతి కానుకగా బాలకృష్ణ మూవీ డాకు మహారాజ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ మూవీ, తన బర్త్ డే నాడు రిలీజ్ కావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ప్రగ్యా జైస్వాల్.
మీ సినీ ప్రయాణం ఎలా సాగుతోంది?
2015 లో తెలుగులో నా సినీ ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణంలో ఎందరో ప్రముఖ నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చేసి, సినిమా గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. పలు మంచి సినిమాల్లో భాగమయ్యాను. మరిన్ని మంచి సినిమాలతో అలరించడానికి ప్రయత్నిస్తున్నాను.
అఖండ, డాకు మహారాజ్, అఖండ-2 బాలకృష్ణ గారితో వరుస సినిమాలు చేయడం ఎలా ఉంది?
బాలకృష్ణ గారితో వరుసగా సినిమా చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. కొవిడ్ సమయంలో ఎవరూ పెద్దగా సినిమా చేయలేదు. అలాంటి సమయంలో బోయపాటి శ్రీను గారు అఖండ కథ చెప్పి, అంత గొప్ప సినిమాలో నన్ను భాగం చేశారు. ఆ సినిమా ఘన విజయం సాధించి, నా సినీ కెరీర్‌ని మరో స్థాయికి తీసుకెళ్లింది.
ఇప్పుడు డాకు మహారాజ్ లాంటి మరో మంచి సినిమాలో బాలకృష్ణ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. డాకు మహారాజ్ కూడా ఘన విజయం సాధిస్తుందని, ఈ చిత్రంలోని నా పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను.
జనవరి 12 మీ పుట్టినరోజు. అదే రోజు డాకు మహారాజ్ రిలీజ్ కావడం ఎలా ఉంది?
పుట్టినరోజు ప్రతి ఏడాది వస్తుంది. కానీ, బాలకృష్ణ గారి సినిమా అనేది ఒక సెలబ్రేషన్ లాంటిది. ఆయనతో కలిసి నేను నటించిన సినిమా నా బర్త్ డేకి విడుదల కావడం నా అదృష్టం. ఇది నా పుట్టినరోజుకి ఒక పెద్ద బహుమతిగా భావిస్తున్నాను.
అలాగే నేను నటించిన సినిమా సంక్రాంతి లాంటి పెద్ద పండుగకు విడుదలవుతుండటం కూడా ఎంతో సంతోషంగా ఉంది. మా డాకు మహారాజ్‌తో పాటు ఈ సంక్రాంతికి విడుదలవుతున్న గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
మీ డ్రీం రోల్ ఏంటి? ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?
ఎస్ఎస్ రాజమౌళి గారు, సంజయ్ లీలా భన్సాలీ లాంటి దర్శకులు తీసే భారీ సినిమాలలో శక్తివంతమైన పాత్రలు పోషించాలని ఉంది. అలాగే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయాలని ఉంది.