Comedy Thriller OTT: ఓటీటీలోకి ప్రేమమ్ హీరోయిన్ కామెడీ థ్రిల్లర్ మూవీ - రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్...
Comedy Thriller OTT: ప్రేమమ్ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్‌గా నటించిన తమిళ కామెడీ మూవీ జాలీ ఓ జింఖానా ఓటీటీలోకి వస్తోంది. ఆహా తమిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ బ్లాక్ కామెడీ మూవీలో ప్రభుదేవా హీరోగా నటించాడు.
Comedy Thriller OTT: ప్రభుదేవా హీరోగా నటించిన బ్లాక్ కామెడీ మూవీ జాలీ ఓ జింఖానా థియేటర్లలో విడుదలైన నెల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఆహా తమిళ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. త్వరలోనే తమ ఓటీటీలో జాలీ ఓ జింఖానా స్ట్రీమింగ్ కానుందని ఆహా ప్రకటించింది. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది.
రిలీజ్ డేట్ మాత్రం రివీల్ చేయలేదు. డిసెంబర్ 28 నుంచి లేదా జనవరి ఫస్ట్ వీక్ నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం.
ప్రేమమ్ ఫేమ్...
జాలీ ఓ జింఖానా మూవీలో ప్రేమమ్ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్‌గా నటించింది. అభిరామి, యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ కామెడీ మూవీకి శక్తి చిదంబరం దర్శకత్వం వహించాడు.
నవంబర్ నెలాఖరున థియేటర్లలో విడుదలైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. అవుట్‌డేటెడ్ కాన్సెప్ట్‌తో పాటు కామెడీ అంతగా వర్కవుట్ కాకపోవడంతో థియేటర్లలో ఈ మూవీ ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఈ సినిమాలో ప్రభుదేవా శవం పాత్రలో కనిపించాడు.
ఎమ్మెల్యేతో గొడవ...
చెల్లమ్మకు (అభిరామి) ముగ్గురు కూతుళ్లు భవానీ, యజానీ, శివానీ(మడోన్నా సెబాస్టియన్) ఉంటారు. భర్త చనిపోవడంతో కష్టపడి భవానీ కూతుళ్లను పెంచుతుంది. అనుకోకుండా చెల్లమ్మతో పాటు భవానీ ఎమ్మెల్యేతో గొడవపడతారు.ఈ కేసులో న్యాయ సహాయం కోసం ఓ లాయర్(ప్రభుదేవా)ను కలుస్తారు.
అనుకోకుండా భవానీ, శివానీతో ఆమె ఫ్యామిలీ మొత్తం ఓ హత్య కేసులో ఇరుక్కుంటారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు శవాన్ని బతికున్న వ్యక్తిగా నమ్మిస్తారు. అసలు వారు హత్య చేసింది ఎవరిని? ఎమ్మెల్యేతో గొడవ నుంచి వారు ఎలా బయటపడ్డారు? ఆ తర్వాత ఏమైంది అన్నదే ఈ మూవీ కథ.
విజయ్ బీస్ట్ మూవీ నుంచి....
విజయ్ బీస్ట్ మూవీలోని జాలీ ఓ జింఖానా అనే పాట నుంచి స్ఫూర్తి పొందుతూ ఈ మూవీకి టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దాదాపు పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఐదు కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టింది.
ప్రేమమ్ మూవీతో...
మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ ప్రేమమ్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మడోన్నా సెబాస్టియన్. ఇందులో ఆమెతో పాటు కథానాయికలుగా కనిపించిన అనుపమ పరమేశ్వరన్, సాయిపల్లవి స్టార్ హీరోయిన్లుగా మారారు. కానీ మడోన్నా సెబాస్టియన్ మాత్రం వారి స్థాయిలో విజయాల్ని, పేరుప్రఖ్యాతుల్ని దక్కించుకోలేకపోయింది. పరాజయాలు ఆమె కెరీర్‌ను దెబ్బతీశాయి. తెలుగులో ప్రేమమ్‌తో పాటు నాని శ్యామ్‌సింగరాయ్‌లో నటించింది. దళపతి విజయ్ లియోతో పాటు మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది.
రిజల్ట్‌తో సంబంధం లేకుండా...
రిజల్ట్‌తో సంబంధం లేకుండా గత కొన్నాళ్లుగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు ప్రభుదేవా. ఈ ఏడాది అతడు హీరోగా నటించిన పేట్టారాప్ , కన్నడ మూవీ కరటక దమనక డిజాస్టర్స్‌గా నిలిచాయి.