Prabhas in Project k Sets: ప్రాజెక్ట్ కే సెట్స్‌లో సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌తో ప్ర‌భాస్ - ఫొటో వైర‌ల్‌-prabhas with legendary director singeetam srinivasa rao in project k sets ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Prabhas With Legendary Director Singeetam Srinivasa Rao In Project K Sets

Prabhas in Project k Sets: ప్రాజెక్ట్ కే సెట్స్‌లో సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌తో ప్ర‌భాస్ - ఫొటో వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Dec 09, 2022 01:43 PM IST

Prabhas in Project k Sets: ప్రాజెక్ట్ కే సినిమా సెట్స్‌లో టాలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌తో ప్ర‌భాస్ దిగిన ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే...

ప్ర‌భాస్‌, సింగీతం శ్రీనివాస‌రావు
ప్ర‌భాస్‌, సింగీతం శ్రీనివాస‌రావు

Prabhas in Project k Sets: ప్ర‌స్తుతం ప్రాజెక్ట్ కే షూటింగ్‌తో ప్ర‌భాస్ బిజీగా ఉన్నాడు. సూప‌ర్ హీరో క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దాదాపు ఐదు వంద‌ల కోట్ల వ్య‌యంతో ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే అత్య‌ధిక బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న సినిమాల్లో ఒక‌టిగా ప్రాజెక్ట్ కేను తెర‌కెక్కుతోంది.

ట్రెండింగ్ వార్తలు

ప్రాజెక్ట్ కే సెట్స్‌లో సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావుతో క‌లిసి ప్ర‌భాస్ దిగిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ సినిమాకు సింగీతం శ్రీనివాస‌రావు మెంటర్, స్క్రిప్ట్ అడ్వైజ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోనే ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌భాస్‌పై ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ముఖ్య స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఇందులో సూప‌ర్ హీరోగా ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో ప్ర‌భాస్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. త‌న‌కున్న మ‌హ‌త్త‌ర శ‌క్తుల‌తో చెడుపై అత‌డు సాగించిన పోరాటాన్ని నాగ్ అశ్విన్ ఈ సినిమాలో చూపించ‌బోతున్నారు. ప్రాజెక్ట్ కే సినిమాలో దీపికా ప‌డుకోణ్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ సినిమాతోనే దీపికా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తోన్నారు. 2023 అక్టోబ‌ర్ 18న ప్రాజెక్ట్ కే సినిమాను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత అశ్వినీద‌త్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.