Prabhas in Unstoppable 2: బాహుబలితో బాలయ్య సందడి.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ఆహా
Prabhas in Unstoppable 2: బాహుబలి స్టార్ ప్రభాస్.. బాలయ్యతో సందడి చేయనున్నారు. ప్రముఖ ఆహా షో అన్‌స్టాపబుల్‌లో పాల్గొని.. బాలయ్యతో కబుర్లు చెప్పనున్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
Prabhas in Unstoppable 2: నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న షో అన్‌స్టాపబుల్. గతేడాది ఆరంభమైన ఈ షోకు విపరీతమైన రెస్పాన్స్ రావడంతో రెండో సీజన్‌కు శ్రీకారం చుట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షోలో ప్రస్తుతం సీజన్2లో ఐదు ఎపిసోడ్‌లు రాగా.. ప్రతీది అద్బుతంగా హిట్టయింది. త్వరలో ఆరో ఎపిసోడ్ కూడా ప్రసారం కానుంది. అయితే ఈ ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా పాన్ఇండియా స్టార్ ప్రభాస్ రానున్నారు. ఈ విషయాన్ని ఆహా సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
ట్రెండింగ్ వార్తలు
ఈ మేరకు ప్రభాస్, బాలయ్య మ్యాషప్‌తో ఓ వీడియోను కూడా విడుదల చేసింది ఆహా. త్వరలో ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతుందని స్పష్టం చేసింది. అన్‌స్టాపబుల్ షోకు ప్రభాస్ రాబోతున్నాడని తెలుకున్న నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. బాలయ్యతో ప్రభాస్ కబుర్లు చూడాలని ఎపిసోడ్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వీడియోకు నెట్టింట విపరీతమైన స్పందన వస్తోంది.
డిసెంబరు 11 నుంచి అన్‌స్టాపబుల్‌లో ప్రభాస్ ఎపిసోడ్‌కు సంబంధించి చిత్రీకరణ జరుగుతుందట. వీలైనంత త్వరలోనే ఎపిసోడ్‌ను ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ షోలో ప్రభాస్‌తో పాటు అతడి స్నేహితుడు గోపిచంద్ కూడా పాల్గొంటాడని టాక్ వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్నీ క్రేజీ కాంబినేషన్లతో బాలయ్య చిట్ చాట్ నిర్వహిస్తారని సమాచారం. ఇందులో భాగంగా అలనాటి తారలు జయసుధ, జయప్రద కూడా పాల్గొంటారని టాక్.
అక్టోబరు నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న అన్‌స్టాపబుల్ సీజన్ 2.. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ ఆరంభమైంది. ఆ ఎపిసోడ్‌లో తన బావమరిది బాలకృష్ణతో కలిసి సరదాగా ముచ్చటించారు. ఈ ఎపిసోడ్ తర్వాత విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ.. అనంతరం శర్వా నంద్, అడివి శేష్, కిరణ్ కుమార్ రెడ్డి, రాధిక పాల్గొన్నారు. ఇక లేటెస్ట్ అయిన ఐదో ఎపిసోడ్‌లో నిర్మాతలు డీ సురేష్ బాబు, అల్లు అరవింద్‌తో పాటు ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు పాల్గొన్నారు.
సంబంధిత కథనం