Harom Hara Teaser - Prabhas: హరోం హర టీజర్‌ను లాంచ్ చేయనున్న ప్రభాస్.. టైమ్ ఇదే
Harom Hara Teaser - Prabhas: హరోం హర మూవీ టీజర్‌ను స్టార్ హీరో ప్రభాస్ లాంచ్ చేయనున్నారు. సుధీర్ బాబు ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. టీజర్ రిలీజ్ డేట్, టైమ్‍ను మూవీ యూనిట్ వెల్లడించింది.
Harom Hara Teaser - Prabhas: నైట్రో స్టార్, హీరో సుధీర్ బాబు కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా సినిమాలు విఫలమవుతున్నాయి. సుధీర్ హీరోగా ఇటీవల వచ్చిన మామ మశ్చీంద్ర సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక, తదుపరి ‘హరోం హర’ చిత్రం చేస్తున్నారు సుధీర్ బాబు. ఈ సినిమా టీజర్ రిలీజ్‍కు కూడా డేట్, టైమ్ ఫిక్స్ అయ్యాయి. ఈ వివరాలను మూవీ యూనిట్ వెల్లడించింది. హరోం హర టీజర్‌ను పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేయనున్నారు. వివరాలివే.
హరోం హర సినిమా టీజర్ రేపు (నవంబర్ 27) మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు టీజర్‌ను పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ లాంచ్ చేయనున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ టీజర్‌ను ప్రభాస్ ఆవిష్కరించనున్నారు. అదే, సమయంలో హైదరాబాద్‍లోని ఏఏఏ సినిమాస్‍లో టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా జరగనుంది.
హరోం హర సినిమా పాన్ ఇండియా రేంజ్‍లో రూపొందనుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కన్నడ టీజర్‌ను హీరో కిచ్చా సుదీప్, మలయాళ టీజర్‌ను సీనియర్ హీరో మమ్మూట్టి.. రేపు లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని శ్రీసుబ్రహ్మణ్య సినిమాస్ బ్యానర్ అధికారికంగా వెల్లడించింది.
హరోం హర మూవీకి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడీగా మాళవిక శర్మ నటిస్తున్నారు. సునీల్, జయ ప్రకాశ్, అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్, రవి కాలే కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుమంత్ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు.
హరోం హర చిత్రాన్ని భారీ బడ్జెట్‍తో నిర్మిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. వచ్చే ఏడాది హరోం హర మూవీ రిలీజ్ కానుంది.