ప్రభాస్ లైనప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్.. అమరన్ డైరెక్టర్ తో మూవీ.. స్టోరీపై లేటెస్ట్ బజ్!-prabhas to work with amaran director raj kumar periasamy for army related story ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ప్రభాస్ లైనప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్.. అమరన్ డైరెక్టర్ తో మూవీ.. స్టోరీపై లేటెస్ట్ బజ్!

ప్రభాస్ లైనప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్.. అమరన్ డైరెక్టర్ తో మూవీ.. స్టోరీపై లేటెస్ట్ బజ్!

ఇప్పటికే క్రేజీ ప్రాజెక్ట్ లను లైనప్ లో పెట్టాడు రెబల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఇప్పుడు మరొక సినిమా చర్చల్లో ఉన్నట్లు సమాచారం. బ్లాక్ బస్టర్ అందించిన అమరన్ డైరెక్టర్ తో ప్రభాస్ పని చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

ప్రభాస్ (x/hombalefilms)

వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. వేల కోట్ల రూపాయలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. కల్కిలో యాక్టింగ్ తో అదరగొట్టాడు. రీసెంట్ గా కన్నప్ప మూవీలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది రాజాసాబ్ అంటూ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇవే కాకుండా ఫౌజీ, స్పిరిట్ తదితర సినిమాలు ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త సినిమా కోసం ప్రభాస్ చర్చలు జరుపుతున్నారనే టాక్ వైరల్ గా మారింది.

ఆ డైరెక్టర్ తో

అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని అందించాడు డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియాసామి. శివ కార్తీకేయన్, సాయి పల్లవి లీడ్ రోల్స్ ప్లే చేసిన ఆ మూవీ ఆడియన్స్ మనసులకు హత్తుకుంది. ఇప్పుడు అమరన్ డైరెక్టర్ తో ప్రభాస్ తర్వాతి సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ వార్త వైరల్ గా మారింది. ఇప్పటికే తన స్టోరీని ప్రభాస్ కు రాజ్ కుమార్ వినిపించారనే విషయం చక్కర్లు కొడుతోంది.

ఆర్మీ బ్యాక్ డ్రాప్

అమరన్ సినిమా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది. ఇప్పుడు ప్రభాస్ కోసం కూడా రాజ్ కుమార్ పెరియార్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లోనే సాగే కథనే సిద్ధం చేశాడనే టాక్ వినిపిస్తోంది. డిఫరెంట్ స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకుంటూ సాగుతున్న ప్రభాస్ కు ఈ కథ కూడా నచ్చినట్లు సమాచారం. అందుకే మరోసారి కలవాలని డైరెక్టర్ కు ప్రభాస్ చెప్పాడని తెలిసింది.

ఈ సినిమాలు

ప్రభాస్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. లైన్ లో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. రాజాసాబ్ మూవీని ప్రభాస్ కంప్లీట్ చేశాడు. ఆ ఏడాది డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆ తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫౌజీని ప్రభాస్ కంప్లీట్ చేయబోతున్నాడు. ఇక సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది.

పోలీస్ గెటప్

ఇవే కాకుండా కల్కి, సలార్ సీక్వెల్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది. అంతేనా హొంబలే ఫిల్మ్స్ తో సినిమాల కోసం ప్రభాస్ డీల్ కూడా కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమాలను ప్రభాస్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో చూడాలి. ఫౌజీలో సైనికుడిగా కనిపించనున్న ప్రభాస్.. స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ వేయబోతున్నాడు. ఇక రాజ్ కుమార్ పెరియాస్వామి సినిమా కోసం కూడా ప్రభాస్ లాఠీ పట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం