ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ ఆరోగ్యం విషమంగా ఉంది. అతడు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతనికి కిడ్నీ మార్పిడి అత్యవసరం అని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై వన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతని కుమార్తె స్రవంతి మాట్లాడుతూ.. ఆర్థిక సహాయం అందించడానికి ప్రభాస్ టీమ్ తమను సంప్రదించిందని వెల్లడించారు. అలాగే, తన తండ్రితో కలిసి పనిచేసిన ఇతర టాలీవుడ్ అగ్ర తారల సహాయాన్ని కూడా ఆమె అభ్యర్థించారు.
టాలీవుడ్ లో ఫిష్ వెంకట్ గా పేరుగాంచిన నటుడు, కమెడియన్ ఇతడు. ప్రస్తుతం కిడ్నీ ఫెయిల్యూర్ తో అతని ఆరోగ్యంగా విషమంగా ఉంది. దీంతో వెంకట్ కుమార్తె స్రవంతి మీడియాతో మాట్లాడుతూ.. కిడ్నీ మార్పిడికి కనీసం రూ. 50 లక్షలు అవసరమవుతాయని, ఈ ఖర్చులో ప్రభాస్ సహాయం చేయడానికి ముందుకొచ్చారని చెప్పారు.
"నాన్న ఆరోగ్యం అస్సలు బాలేదు. ఆయన చాలా సీరియస్‌గా ఉన్నారు, ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు కిడ్నీ మార్పిడి అవసరం. దీనికి కనీసం రూ. 50 లక్షలు ఖర్చవుతుంది. ప్రభాస్ పీఆర్ టీమ్ నుండి మాకు ఫోన్ వచ్చింది. వారు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఆపరేషన్ జరిగినప్పుడు ఖర్చు భరించడానికి తమకు తెలియజేయమని అడిగారు" అని ఆమె వివరించారు.
అయితే, అసలు సమస్య కిడ్నీ దాతను కనుగొనడమేనని ఆమె అన్నారు. కుటుంబంలో ఎవరూ కిడ్నీ దానం చేయడానికి వీలు కావడం లేదని, దాతను కనుగొనలేకపోతున్నామని ఆమె వాపోయారు. దాతను కనుగొనడంలో సహాయం కోరుతూ ఆమె ఇలా అన్నారు.. "చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు.. వీరందరితోనూ నాన్న మంచి సినిమాలు చేశారు. ఇప్పుడు ఎవరూ ఆయనను పట్టించుకుంటున్నట్లు లేదు. దయచేసి మా నాన్నకు దాతను కనుగొనడంలో సహాయం చేయాలని అందరినీ కోరుతున్నాను" అని అన్నది.
ఫిష్ వెంకట్ టాలీవుడ్‌లో తన హాస్య, విలన్ పాత్రలకు బాగా పేరు పొందారు. తెలంగాణ యాసలో ఆయన డైలాగ్ డెలివరీ ఆయనకు 'ఫిష్' అనే పేరును తెచ్చిపెట్టింది. ఆయన కుమార్తె చెప్పినట్లుగా, ఆయన అగ్ర టాలీవుడ్ స్టార్లతో కలిసి 'బన్నీ', 'అదుర్స్', 'ఢీ', 'మిరపకాయ్' వంటి అనేక హిట్ చిత్రాలలో నటించారు.
ఇటీవల ఆహాలో విడుదలైన థ్రిల్లర్ మూవీ ‘కాఫీ విత్ ఎ కిల్లర్’లో ఆయన కనిపించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆయన సిద్ధు జొన్నలగడ్డతో కలిసి 'మా వింత గాధ వినుమా', 'డీజే టిల్లు' చిత్రాలలో నటించి, తన నటనకు ప్రశంసలు అందుకున్నారు.
సంబంధిత కథనం