Prabhas The Rajasaab Release Date: ప్రభాస్ ది రాజాసాబ్ రిలీజ్ డేట్ ఇదే!
Prabhas The Rajasaab Release Date: రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వస్తున్న ది రాజాసాబ్ మూవీ డిసెంబర్ లో రిలీజయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Prabhas The Rajasaab Release Date: సలార్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ మధ్య వరుసగా గుడ్ న్యూస్ వస్తూనే ఉన్నాయి. తాజాగా అతని లేటెస్ట్ మూవీ టైటిల్ ను ది రాజాసాబ్ గా అనౌన్స్ చేయగా.. ఇప్పుడీ మూవీ రిలీజ్ టైమ్ పై కూడా లీకులు వస్తున్నాయి. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ మే 9న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ది రాజాసాబ్ మూవీని క్రిస్మస్ సమయంలో రిలీజ్ చేయడానికి మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూవీ షూటింగ్ 50 శాతం వరకూ పూర్తయిందని, మిగతా షూటింగ్ కూడా వేగంగా పూర్తి చేసి ఈ ఏడాదిలోనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ ఏడాదీ రెండు ప్రభాస్ సినిమాలు
బాహుబలి మూవీ నుంచి ఒక్కో సినిమా తీయడానికి ప్రభాస్ చాలా సమయం తీసుకుంటున్నాడు. 2017లో బాహుబలి 2 రిలీజ్ కాగా.. ఈ ఏడేళ్లలో కేవలం నాలుగు ప్రభాస్ సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో రెండు సినిమాలు గతేడాదే రిలీజ్ అయ్యాయి. మొదట ఆదిపురుష్, తర్వాత సలార్ వచ్చాయి.
ఇక ఇప్పుడు 2024లోనూ మరో రెండు ప్రభాస్ సినిమాలు రావడం ఖాయమని తేలిపోయింది. మొదట మే 9న కల్కి 2898 ఏడీ రిలీజ్ కాబోతోంది. ఇక ఇప్పుడు రాజాసాబ్ మూవీ కూడా డిసెంబర్ లో రానున్నట్లు వార్తలు వస్తుండటంతో ఈ ఏడాది కూడా రెండు సినిమాలు రానున్నాయి.
మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ మూవీ ఓ రొమాంటిక్ హారర్ కామెడీ జానర్ లో రాబోతోంది. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు, సీరియస్ క్యారెక్టర్లు చేస్తున్న ప్రభాస్.. ఇప్పుడు రాజాసాబ్ లో పూర్తి డిఫరెంట్ రోల్ ప్లే చేయనున్నాడు. టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజైన పోస్టర్ లో లుంగీ లుక్ లో ప్రభాస్ చాలా డిఫరెంట్ గా కనిపించాడు.
ఈ రాజాసాబ్ మూవీలో మాళవికా మోహనన్ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇక తమిళ కమెడియన్ యోగి బాబు ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో వివిధ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఓ గ్రామీణ యువకుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు.
రాజాసాబ్ మూవీని హైదరాబాద్ తోపాటు ఏపీలోని కొన్ని లొకేషన్లలో షూట్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్, మారుతి గత సినిమాలు చూస్తే ఈ మూవీ కూడా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ గా కనిపిస్తోంది.