Director Maruthi About Buying Allu Arjun Arya Movie: టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో మారుతి ఒకరు. ఈ రోజుల్లో సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చిన మారుతి మొదటి మూవీతోనే సాలిడ్ హిట్ కొట్టారు. ఈ రోజుల్లో మూవీ విపరీతంగా యూత్‌ను అట్రాక్ట్ చేసింది.
ఆ తర్వాత చేసిన బస్ స్టాప్ సినిమాకు కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. అనంతరం అల్లు శిరీష్‌తో తెరకెక్కించిన కొత్త జంట పర్వాలేదనిపించుకుంది. ఇక నేచురల్ స్టార్ నానితో భలే భలే మగాడివోయ్ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నారు మారుతి. ఇక మారుతి కథ అందించిన హారర్ కామెడీ మూవీ ప్రేమ కథా చిత్రమ్ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది.
ఈ సినిమాతోనే తెలుగులో హారర్ కామెడీ జోనర్ ఊపందుకుంది. అలాంటి దర్శకుడు మారుతి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తోనే సినిమా చేస్తున్నారు. హారర్ కామెడీ జోనర్‌లో ప్రభాస్-మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ది రాజా సాబ్ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే, కట్నం డబ్బులతో అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ ఆర్యను కొన్నట్లు డైరెక్టర్ మారుతి గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి చెబుతూ దర్శకుడిగా కంటే కో ప్రొడ్యూసర్‌గా చేసినట్లు చెప్పిన మారుతి ఆర్య మూవీని కొనడం గురించి చెప్పారు.
"మీరు ఫస్ట్ కో ప్రొడ్యూసర్ (సహ నిర్మాతగా) మొదలుపెట్టారు కదా. మరి అంత డబ్బు ఎక్కడిదికి మీకు" అని యాంకర్ అడిగితే.. "అవును సర్, మేము డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్లం సార్. నేను యూవీ క్రియేషన్ వంశీ, బన్నీ వాసు ముగ్గురం కలిసి ఆర్య సినిమా కొన్నాం సర్. ఫస్ట్ రాజు గారి దగ్గర. నాకు కట్నం డబ్బులు ఒక రూ. 6 లక్షలు ఇచ్చారన్నమాట" అని దర్శకుడు మారుతి చెప్పారు.
"ఓహో.. మీరు కట్నం తీసుకున్నారా" అని యాంకర్ ప్రశ్నించారు. "నేను తీసుకోలా" అని మారుతి చెబుతుంటే.. "అదే వాళ్ల వాటా కింద వచ్చింది" అని యాంకర్ అన్నారు. "మా వైఫ్ పేరు మీద డిపాజిట్ చేశారు. వాడుకుంటే వాడుకో లేకుంటే లేదు అని" అని మారుతి వివరణ ఇస్తుంటే.. "నాకు అర్థమైందిలే. అదే అంటున్నా. కట్నం అంటే మళ్లీ నేరం అవుతుంది. ఆవిడ వాటా కింద వచ్చింది" అని యాంకర్ నవ్వుతు అన్నారు.
"ఛీ ఛీ అది కాదు. నేను దానికి (కట్నం) వ్యతిరేకం పూర్తిగా.. ఎందుకుంటే నేను.. మా వైఫ్‌ది నాది లవ్ కమ్ అరెంజ్‌డ్ మ్యారేజ్. అంటే నా గ్రోత్ చూసి చేశారన్నమాట. అప్పుడు తనకు తన అకౌంట్‌లో వాళ్ల తాతగారు వేసిన డిపాజిట్ ఏదో రూ. 5 లక్షలు అయితే.. కావాలంటే యూజ్ చేసుకోండి దేనికైనా కెరీర్ పరంగా ఉపయోగపడుతుందంటే అప్పుడు నేను ఆ డబ్బులు తీసుకుని ఆర్య కొన్నాను" అని డైరెక్టర్ మారుతి చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం