Prabhas Movie Shootings: అనారోగ్యంతో ప్రభాస్.. షూటింగ్ క్యాన్సిల్
Prabhas Movie Shootings: ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన తన సినిమా షూటింగులు క్యాన్సిల్ చేస్తున్నట్లు సమాచారం. ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆదిపురుష్, సలార్ లాంటి చిత్రాలతో తీరిక లేకుండా చిత్రీకరణ చేస్తున్నాడు. ఇప్పటికే కొన్ని పూర్తయితే, మరికొన్ని సెట్స్‌పైన ఉన్నాయి. ఇంకొన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్న ప్రభాస్‌కు తాజాగా ఆరోగ్యం బాగోలేదట. జ్వరంతో మన డార్లింగ్ బాధపడుతున్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం.
ఈ కారణంగా తన సినిమాల షూటింగులను క్యాన్సిల్ చేసినట్లు సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం మారుతీ సినిమాన పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇది కాకుండా ప్రశాంత్ నీల్ సలార్ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. మరోపక్క నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే షూటింగ్ కొనసాగుతోంది. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభాస్-మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించే సినిమా రానుంది. ఇది కాకుండా దిల్ రాజుతో ఓ సినిమా, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే సినిమాను ప్రకటించేశాడు.
మరోపక్క ఆదిపురుష్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీఎఫ్ఎక్స్, సీజీ పనులను మళ్లీ ప్రారంభించారు. ఈ విధంగా ప్రభాస్ నటించే సినిమాలన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు మన డార్లింగ్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో షూటింగులు క్యాన్సిల్ చేశాడని టాక్. అయితే అభిమానులు కంగారు పడాల్సిన అవసం లేదని, ప్రస్తుతం డార్లింగ్ ఆరోగ్యం బాగానే ఉందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
ప్రభాస్ చివరగా రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకులను పలకించారు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో ఆయన తన ఆశలన్నీ ఆదిపురుష్, సలార్ చిత్రాలపైనే పెట్టుకున్నారు. ఈ సినిమా యావరేజ్ టాక్‌తో ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టింది రాధేశ్యామ్.