Salaar Advance Booking : నెల ముందే సలార్ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్.. అక్కడ ప్రభాస్‌కు భారీ క్రేజ్
Salaar Movie Tickets Advance Booking : ప్రభాస్ నటించిన సలార్ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి.. నెల రోజు ముందే అడ్వాన్స్ బుకింగ్ షురూ అయిందని ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ తెలిపాడు.
ప్రభాస్ కొన్నేళ్లుగా వరుస పరాజయాలను చూస్తున్నాడు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్(Adipurush) సినిమాలు ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాయి. ఇప్పుడు అతని దృష్టి అంతా సలార్, కల్కి 2898 AD సినిమాలపైనే ఉంది. అందులో ముందుగా సలార్ విడుదల(Salaar Release) కానుంది. సెప్టెంబర్ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇంకా ఒక నెల సమయం ఉంది. అమెరికాలో అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్ విండో ఇప్పటికే తెరిచి ఉంది. అక్కడ కూడా ప్రభాస్‌కి అభిమానులున్నారు. ఈ సినిమా చూసేందుకు తొలిరోజే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. దాంతో ఈ సినిమా విడుదలకు ముందే భారీ బిజినెస్ చేస్తోంది.
కేజీఎఫ్: చాప్టర్ 2 సినిమా ద్వారా ప్రశాంత్ నీల్(Prashanth Neel) మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆయన దర్శకత్వంలో సలార్ సినిమా రూపొందుతుండడంతో సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక సంస్థ హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ చూసి వావ్ అంటున్నారు జనాలు. ఫలితంగా ముందస్తు టిక్కెట్ బుకింగ్ చాలా వేగంగా జరుగుతోంది.
ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్(Salaar Movie Advance Booking) గురించిన సమాచారాన్ని పంచుకున్నాడు. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 83 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని ట్వీట్ చేశాడు. నెల రోజుల ముందే వ్యాపారం ఇలా సాగుతోంది. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ కోట్ల బిజినెస్ అవ్వడం ఖాయం. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎంత అంచనాలు ఉన్నాయో అడ్వాన్స్ బుకింగ్ ఓ నిదర్శనం.
ఇండియాలో సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. కానీ ప్రేక్షకులు మాత్రం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో కనిపిస్తాడు. ఈ చిత్రానికి కేజీఎఫ్ 2(KGF 2) కథకు మధ్య ఏదైనా లింక్ ఉండొచ్చని పలువురు అంచనా వేస్తున్నారు. సినిమా విడుదలైన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుంది. చిత్రంలో భారీ సెట్స్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.