Project K Pre Release Business: అంచనాలు తలకిందులు చేస్తోన్న ప్రభాస్ సినిమా.. ట్రేడ్ పండితులు షాక్..!
Project K Pre Release Business: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రాజెక్టు కే విడుదలకు చాలా కాలం ఉన్నప్పటికీ.. అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాకు భారీ స్థాయిలో థియెట్రికల్ బిజినెస్ జరుగుతోంది.
Project K Pre Release Business: పాన్ఇండియా స్టార్ ప్రభాస్‌కు బాహుబలి తర్వాత ఆ స్థాయి విజయం దక్కలేదన్నది వాస్తవం. సాహో, రాధేశ్యామ్ లాంటి చిత్రాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో అతడి తదుపరి చిత్రాలపై గట్టి ప్రభావమే ఉంటుందని అంచనా వేశారు ట్రేడ్ పండితులు. అయితే ప్రాజెక్టు కే సినిమా బిజినెస్ చూస్తుంటే వారిని షాక్‌కు గురిచేస్తుందే. గతేడాది విడుదలైన రాధేశ్యామ్ ఫ్లాప్ అయినప్పటికీ.. వ్యాపారం భారీగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నైజాం, ఆంధ్ర, సీడెడ్ లాంటి తెలుగు ప్రాంతాల్లో మైండ్ బ్లోయింగ్ బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించడం, దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్ లాంటి భారీ తారాగణం నటిస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్లు జేబులకు చిల్లులు తప్పడం లేదు.
ట్రెండింగ్ వార్తలు
టాలీవుడ్ ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ప్రాజెక్టు కే థియెట్రికల్ హక్కులు భారీ స్థాయి పలికాయని సమాచారం. సునీల్ నారంగ్ ఈ సినిమా నైజాం హక్కులను రూ.70 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే నిర్మాతలు ఈ ఒక్క ఏరియా నుంచే రూ.80 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. సునీల్ నారాంగే ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోపక్క ఆంధ్ర, సీడెడ్ కలిపి ప్రాజెక్టు కే థియెట్రికల్ హక్కులు రూ.100 కోట్లకు అమ్ముడుపోతాయని అంచనా వేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా థియెట్రికల్ హక్కులు 170 నుంచి 180 కోట్ల మేర బిజినెస్ జరుగుతుందని సమాచారం. దీంతో చాలా సెంటర్లలో ఆర్ఆర్ఆర్, బాహుబలి ధరలకు సమానంగా ప్రాజెక్టు కే అమ్ముడవుతోందని తెలుస్తోంది. ప్రాజెక్టు కే 2024లో విడుదలవుతుందనుకుంటే ఈ గణాంకాలు మరింత పెరిగే అవకాశముంది.
సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లోనూ భారీ బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇవి కాకుండా శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలో ప్రాజెక్టు కే మేకర్స్‌కు అదనపు మొత్తం రానుంది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్‌కు తీవ్రంగా డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.
వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రాజెక్టు కే సినిమాను అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోప ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేస్తోంది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా 2023 చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సంబంధిత కథనం