Prabhas Spirit Movie Update: స్పిరిట్ సినిమాలో ప్ర‌భాస్ రోల్ ఇదే - రివీల్ చేసిన ప్రొడ్యూస‌ర్‌-prabhas spirit movie update prabhas role revealed in sandeep vanga spirit movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas Spirit Movie Update Prabhas Role Revealed In Sandeep Vanga Spirit Movie

Prabhas Spirit Movie Update: స్పిరిట్ సినిమాలో ప్ర‌భాస్ రోల్ ఇదే - రివీల్ చేసిన ప్రొడ్యూస‌ర్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 14, 2023 08:54 PM IST

Prabhas Spirit Movie Update: ప్ర‌భాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న స్పిరిట్ సినిమా ఆగిపోయిన‌ట్లు చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పుకార్ల‌ను ప్రొడ్యూస‌ర్ భూష‌ణ్ కుమార్ ఖండించారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ రోల్‌ను రివీల్ చేశాడు.

ప్ర‌భాస్
ప్ర‌భాస్

Prabhas Spirit Movie Update: అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో స్పిరిట్‌ పేరుతో ప్ర‌భాస్ ఓ సినిమా క‌మిటైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను అనౌన్స్ చేసి దాదాపు రెండేళ్ల‌పైనే అయ్యింది. ఆ త‌ర్వాత స్పిరిట్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాక‌పోవ‌డంతో సినిమా ఆగిపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

స్పిరిట్ త‌ర్వాత అనౌన్స్ చేసిన సినిమాల షూటింగ్‌ల‌ను ప్ర‌భాస్ మొద‌లుపెట్టారు. కానీ ప్ర‌భాస్ - సందీప్ వంగా సినిమా మాత్రం మొద‌లుకాక‌పోవ‌డంతో ఈ కాంబో కార్య‌రూపం దాల్చ‌డం క‌ష్ట‌మేన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ పుకార్ల‌కు నిర్మాత భూష‌ణ్ కుమార్ చెక్ పెట్టారు.

స్పిరిట్ సినిమా ఆగిపోలేద‌ని ప్ర‌క‌టించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌స్తుతం ర‌ణ్‌భీర్‌క‌పూర్‌తో సందీప్ వంగా తెర‌కెక్కిస్తోన్న యానిమ‌ల్ సినిమా షూటింగ్ పూర్తికాగానే స్పిరిట్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు తెలిపాడు.

పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌నున్న‌ట్లు భూష‌ణ్ కుమార్ ప్ర‌క‌టించాడు. స్పిరిట్ సినిమాలో ప్ర‌భాస్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలిపాడు. అర్జున్‌రెడ్డి, యానిమ‌ల్ సినిమాల‌కు భిన్నంగా స్పిరిట్ క‌థ‌ను సందీప్ వంగా సిద్ధం చేసిన‌ట్లు తెలిపాడు. ప్ర‌భాస్ రోల్‌, క్యారెక్ట‌రైజేష‌న్‌ను కొత్త కోణంలో డైరెక్ట‌ర్ సందీప్ వంగా ప్ర‌జెంట్ చేయ‌బోతున్న‌ట్లు భూష‌ణ్ కుమార్ చెప్పాడు.

ఈ ఏడాది వేస‌వి త‌ర్వాత స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు తెలిసింది. న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్‌లో స్పిరిట్ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌లార్‌, ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్నారు.

గ్యాంగ్‌స్ట‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న స‌లార్ సినిమాకు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్రాజెక్ట్ కే సినిమాకు నాగ్ అశ్విన్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. అలాగే ప్ర‌భాస్ హీరోగా ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆదిపురుష్ సినిమా 2023 జూన్‌లో రిలీజ్ కానుంది.

IPL_Entry_Point

టాపిక్