Official: ప్రభాస్ అభిమానులకు భారీ బ్యాడ్ న్యూస్.. సలార్ వాయిదా.. కొత్త డేట్ ఏదంటే?-prabhas salaar movie postponed and hombale films officially announced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Official: ప్రభాస్ అభిమానులకు భారీ బ్యాడ్ న్యూస్.. సలార్ వాయిదా.. కొత్త డేట్ ఏదంటే?

Official: ప్రభాస్ అభిమానులకు భారీ బ్యాడ్ న్యూస్.. సలార్ వాయిదా.. కొత్త డేట్ ఏదంటే?

Sanjiv Kumar HT Telugu
Published Sep 13, 2023 10:14 AM IST

Salaar Postponed: ప్రభాస్ అభిమానులకు హోంబలే ఫిల్మ్స్ సంస్థ పెద్ద షాక్ ఇచ్చింది. ప్రభాస్ సలార్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ నిరాశ చెందే న్యూస్ చెప్పింది మూవీ టీమ్. సలార్ వాయిదాపై అనేక రూమర్లు రాగా తాజాగా అధికారికంగా వెల్లడించింది.

ప్రభాస్ సలార్ వాయిదా.. కొత్త డేట్ ఏదంటే?
ప్రభాస్ సలార్ వాయిదా.. కొత్త డేట్ ఏదంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‍కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక డార్లింగ్ సినిమాల కోసం ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులే కాదు.. బాక్సాఫీస్ కూడా ఎదురుచూస్తుంటుంది. అలాంటి ప్రభాస్ ప్రస్తుతం ఐదారు క్రేజీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటే సలార్. కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. అయితే ఈ సినిమా విడుదలపై తాజాగా అభిమానులకు షాక్ ఇచ్చారు మేకర్స్.

అధికారికంగా వెల్లడి

యాక్షన్ ఎంటర్టైనర్‍గా తెరకెక్కిన సలార్ పార్ట్ 1- సీజ్‍ఫైర్ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు మొదట్లే మేకర్స్ ప్రకటించారు. కానీ, ఇటీవల ఈ డేట్ కాకుండా సలార్ వాయిదా పడనుందని రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ రూమర్సే నిజమయ్యాయి. తాజాగా మూవీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సలార్ వాయిదా పడతున్నట్లు అధికారికంగా వెల్లడించింది.

విశ్రాంతి లేకుండా

"సలార్ చిత్రంపై మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ డేట్‌గా ప్రకటించిన సెప్టెంబర్ 28 కాకుండా వాయిదా వేస్తున్నాం. అద్భుతమైన సినిమాటిక్స్ ఎక్స్ పీరియన్స్ ను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి, ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకోండి. సినిమాను అత్యధిక స్టాండర్డ్స్ లో తెరకెక్కించడానికి విశ్రాంతి లేకుండా మూవీ టీమ్ శ్రమిస్తోంది. కొత్త రిలీజ్ తేదిని సెప్టెంబర్ 28లోగా వెల్లడిస్తాం" అని హోంబలే ఫిల్మ్స్ సంస్థ పోస్టులో పేర్కొంది.

కొత్త తేదీలు

ఇదిలా ఉంటే సలార్ సినిమా సెప్టెంబర్ 28న కాకుండా వాయిదా పడనుండగా.. మరో రెండు కొత్త తేదీలు ఆసక్తికరంగా మారాయి. అనుకున్నట్లుగా సినిమా నిర్మాణం పూర్తి అయితే.. నవంబర్ 10, లేదా 24న సలార్ విడుదల చేయనున్నట్లు మరో రూమర్ చక్కర్లు కొడుతోంది. కాగా సలార్ సినిమాలో శృతి హాసన్, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనాక్షి చౌదరి, శ్రీయా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Whats_app_banner