Prabhas Salaar Record: రిలీజ్‌కు ఏడు నెల‌ల ముందే బుక్‌మై షోలో స‌లార్ రికార్డ్‌-prabhas salaar gets 100k interests in bookmyshow ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas Salaar Gets 100k Interests In Bookmyshow

Prabhas Salaar Record: రిలీజ్‌కు ఏడు నెల‌ల ముందే బుక్‌మై షోలో స‌లార్ రికార్డ్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 02, 2023 10:45 AM IST

Prabhas Salaar Record: రిలీజ్‌కు ఏడు నెల‌ల ముందే ప్ర‌భాస్ స‌లార్ సినిమా బుక్‌మై షోలో యూనిక్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ రికార్డ్ ఏదంటే...

ప్ర‌భాస్ స‌లార్
ప్ర‌భాస్ స‌లార్

Prabhas Salaar Record: ప్ర‌భాస్ హీరోగా న‌టించిన స‌లార్ సినిమా సెప్టెంబ‌ర్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్‌కు ఏడు నెల‌ల ముందుగానే బుక్‌మై షో యాప్‌లో ఈ సినిమా కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బుక్‌మై షోలో 100 కే (ల‌క్ష‌) ఇంట్రెస్ట్స్‌ పొందిన సినిమాగా నిలిచింది.

పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో స‌లార్‌కు ఉన్న క్రేజ్‌కు ఈ రికార్డ్ నిద‌ర్శ‌నమని ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఈ సినిమాలో ప్ర‌భాస్ క‌రుడుగ‌ట్టిన గ్యాంగ్‌స్ట‌ర్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ తుదిద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం.

ఇందులో మ‌ల‌యాళ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడు. అత‌డితో పాటు జ‌గ‌ప‌తిబాబు నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఆద్య అనే జ‌ర్న‌లిస్ట్‌గా శృతిహాస‌న్ న‌టిస్తోంది. ఆమె పాత్ర‌కు సంబంధించి షూటింగ్ ఇటీవ‌లే పూర్త‌యిన‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో విజ‌య్ కిర‌గందూర్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. తెలుగుతో పాటు క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. స‌లార్‌తో పాటు ఆదిపురుష్, ప్రాజెక్ట్ కేతో పాటు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు ప్ర‌భాస్‌.

IPL_Entry_Point