Kannappa Prabhas Remuneration: కన్నప్ప కోసం ప్రభాస్, మోహన్ లాల్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన మంచు విష్ణు-prabhas remuneration for kannappa movie manchu vishnu reveals mohan lal remuneration ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kannappa Prabhas Remuneration: కన్నప్ప కోసం ప్రభాస్, మోహన్ లాల్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన మంచు విష్ణు

Kannappa Prabhas Remuneration: కన్నప్ప కోసం ప్రభాస్, మోహన్ లాల్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన మంచు విష్ణు

Hari Prasad S HT Telugu

Kannappa Prabhas Remuneration: కన్నప్ప మూవీ కోసం ప్రభాస్, మోహన్ లాల్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో చెప్పాడు ఈ మూవీ లీడ్, ప్రొడ్యూసర్ మంచు విష్ణు. ఈ పాన్ ఇండియా మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

కన్నప్ప కోసం ప్రభాస్, మోహన్ లాల్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన మంచు విష్ణు

Kannappa Prabhas Remuneration: అత్యంత భారీ బడ్జెట్ తో, ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మూవీ కన్నప్ప. మంచు విష్ణు లీడ్ రోల్లో నటిస్తున్నాడు. రూ.140 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్ లాంటి వాళ్లు కూడా అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమా కోసం వాళ్లు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

కన్నప్ప కోసం ప్రభాస్, మోహన్ లాల్ రెమ్యునరేషన్

కన్నప్ప మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఈ మధ్యే ప్రభాస్ లుక్ కూడా రివీలైంది. అయితే ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్ లాంటి వాళ్లు నటించడం, వాళ్ల రెమ్యునరేషన్ వివరాలపై ది హాలీవుడ్ రిపోర్టర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడాడు. అయితే ఈ సినిమా కోసం వాళ్లు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, తన తండ్రి మోహన్ బాబుపై ఉన్న గౌరవంతోనే ఇద్దరూ ఎంతో ఆసక్తిగా ఈ సినిమా చేశారని విష్ణు వెల్లడించాడు.

అంతేకాదు మోహన్ లాల్ తో తాను రెమ్యునరేషన్ గురించి మాట్లాడినప్పుడు అతడు ఎలా స్పందించాడో కూడా విష్ణు చెప్పాడు. "నువ్వు అంత పెద్దోడివి అయిపోయావని అనుకుంటున్నావా అని మోహన్ లాల్ సరదాగా అన్నారు" అంటూ విష్ణు చెప్పుకొచ్చాడు. ప్రభాస్, మోహన్ లాల్ లాంటి వాళ్లు ఎంత వినయంగా ఉంటారో ఇలాంటివి చూసినప్పుడు తెలుస్తుందని విష్ణు అన్నాడు.

కన్నప్పలో వాళ్ల పాత్రలు ఇలా

కన్నప్ప మూవీని మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అంతేకాదు ఇందులో కన్నప్ప పాత్రలోనూ అతడే కనిపిస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ రుద్ర పాత్రలో నటిస్తున్నాడు. అతని లుక్ ను ఈ నెల మొదట్లోనే మేకర్స్ రివీల్ చేసిన విషయం తెలిసిందే.

ఇక మోహన్ లాల్ ఈ సినిమాలో కిరాటా పాత్రలో కనిపించబోతున్నాడు. పార్వతిగా ప్రముఖ నటి కాజల్ నటిస్తోంది. వీళ్లే కాకుండా మోహన్ బాబు, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్, విష్ణు కూతుళ్లు ఆరియానా, వివియానా కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం