Chiranjeevi Birthday: చిరుని ఇమిటేట్ చేసిన ప్రభాస్.. మెగాస్టార్‌కి వెరైటీగా కల్కి టీమ్ బర్త్ డే విషెస్
Chiranjeevi Birthday: చిరుని ఇమిటేట్ చేశాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. మెగాస్టార్‌కి కల్కి 2898 ఏడీ టీమ్ బర్త్ డే విషెస్ కాస్త డిఫరెంట్ గా చెప్పింది. మంగళవారం (ఆగస్ట్ 22) చిరు తన పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే
Chiranjeevi Birthday: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మంగళవారం (ఆగస్ట్ 22) తన 68వ పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతనికి సినిమా ఇండస్ట్రీ మొత్తం బర్త్ డే విషెస్ చెప్పింది. అయితే వీళ్లందరిలో కల్కి 2898 ఏడీ టీమ్ కాస్త డిఫరెంట్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం విశేషం. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను కూడా ఈ టీమ్ షేర్ చేసింది.

నాలుగు దశాబ్దాల సినిమా కెరీర్లో చిరు ఎన్నో ఐకానిక్ సినిమాలు, సీన్లలో నటించాడు. అలాంటి ఓ సీన్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రీక్రియేట్ చేసిన వీడియో ఇది. మూడు దశాబ్దాల కిందట సూపర్ డూపర్ హిట్ అయిన గ్యాంగ్ లీడర్ మూవీలోని సీన్ ను ప్రభాస్ రీక్రియేట్ చేయడం విశేషం. ఆ సినిమాలో పోర్టబుల్ గ్యాస్ బర్నర్ ను మండిస్తూ చిరంజీవి కనిపిస్తాడు.
ఇప్పుడు ప్రభాస్ కూడా అచ్చూ అలాగే చేసిన సీన్ ను కల్కి 2898 ఏడీ టీమ్ రిలీజ్ చేసింది. ఎడిటింగ్ రూమ్ నుంచి ఈ సీన్ లీక్ చేస్తున్నట్లుగా చెబుతూ.. తాము చిరు లీక్స్ నుంచి స్ఫూర్తి పొందినట్లు ఈ టీమ్ చెప్పడం విశేషం. ఈ చిన్న వీడియోలో ప్రభాస్ డాషింగ్ లుక్ లో కనిపించాడు. "స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్ట్స్ అండ్ ఎడిటింగ్ రూమ్ ఆఫ్ కల్కి 2898 ఏడీ" అనే క్యాప్షన్ తో ఈ వీడియో రిలీజ్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి గారికి ఎక్స్‌ట్రార్డినరీ బర్త్ డే విషెస్ అని కల్కి టీమ్ చెప్పింది. చిరంజీవి సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 150కిపైగా సినిమాల్లో నటించాడు. ఈ మధ్యే భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరుకి తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.
మరోవైపు ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ నుంచీ ప్రాజెక్ట్ కేగా పిలిచిన తన సినిమా పేరు కల్కి 2898 ఏడీ అని గత నెలలోనే మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ లీడ్ రోల్లో నటించగా.. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు.