Prabhas Project K: సూప‌ర్ హీరోగా ప్ర‌భాస్ - ప్రాజెక్ట్ కే క‌థ ఇదేనా-prabhas plays superhero role in nag ashwin project k movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas Plays Superhero Role In Nag Ashwin Project K Movie

Prabhas Project K: సూప‌ర్ హీరోగా ప్ర‌భాస్ - ప్రాజెక్ట్ కే క‌థ ఇదేనా

Nelki Naresh Kumar HT Telugu
Dec 04, 2022 04:18 PM IST

Prabhas Project K: ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందుతోన్న చిత్రం ప్రాజెక్ట్‌. దాదాపు ఐదు వంద‌ల కోట్ల వ్య‌యంతో ఇండియాలోనే అత్యంత భారీ బ‌డ్జెట్ సినిమాల్లో ఒక‌టిగా ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో ప్ర‌భాస్ రోల్ ఏదంటే..

ప్ర‌భాస్
ప్ర‌భాస్

Prabhas Project K: ప్ర‌భాస్ హీరోగా మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ప్రాజెక్ట్ కే. దాదాపు ఐదు కోట్ల వ్య‌యంతో ఇండియాలోనే అత్యంత భారీ బ‌డ్జెట్ సినిమాల్లో ఒక‌టిగా పాన్ ఇండియ‌న్ స్థాయిలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. సెంటిఫిక్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ప్రాజెక్ట్ కే రూపొంద‌నున్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అందులో వాస్త‌వం లేద‌ని తెలిసింది.

సూప‌ర్ హీరో క‌థాంశంతో నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్లు స‌మాచారం. సూప‌ర్ ప‌వ‌ర్స్ ఉన్న హీరోగా ప్ర‌భాస్ రోల్ ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌న‌కున్న ప‌వ‌ర్స్‌తో దుష్ట శ‌క్తుల‌తో ప్ర‌భాస్ ఎలాంటి పోరాటం చేశాడ‌న్న‌ది ఈ సినిమా క‌థ అని చెబుతున్నారు.

మైథ‌లాజిక‌ల్ ట‌చ్‌తో ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఈ క‌థ‌ను రాసుకున్న‌ట్లు తెలిసింది. ఈ సినిమాలో దీపికా ప‌డుకోణ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్రాజెక్ట్ కేతోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్‌బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.దిశాప‌టానీ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై అశ్వ‌నీద‌త్ ఈ భారీ బ‌డ్జెట్ సినిమాను నిర్మిస్తోన్నారు. మిక్కీ జే మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

తెలుగుతో పాటు హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, ఇంగ్లీష్ బాష‌ల్లోకి డ‌బ్ చేయ‌బోతున్నారు. 2023 అక్టోబ‌ర్ 18న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

IPL_Entry_Point