Squid Game: స్క్విడ్ గేమ్ ప్లేయర్లుగా ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్, అల్లు అర్జున్, రజినీ సహా స్టార్ హీరోలు.. వీడియో వైరల్
Squid Game 2 AI Video: స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయింది. ఈ సిరీస్‍లో ఇటీవలే రెండో సీజన్ వచ్చి దూసుకెళుతోంది. ఈ తరుణంలో భారత సినీ స్టార్లు స్క్విడ్ గేమ్ ప్లేయర్లుగా ఉన్న ఓ ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ వరల్డ్ వైడ్‍గా చాలా పాపులర్ అయింది. 2021లో వచ్చిన ఈ కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ ఫస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ అయింది. ప్రపంచంలోనే అత్యధిక మంది చూసిన సిరీస్‍గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్‍లో రెండో సీజన్ స్క్విడ్ గేమ్ 2.. గత నెల డిసెంబర్ 26న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అంచనాలకు తగ్గట్టే దుమ్మురేపుతోంది. తాజా స్క్విడ్ గేమ్‍పై చేసిన ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వీడియో వైరల్ అవుతోంది. భారతీయ సినీ స్టార్లతో ఈ వీడియో ఉంది. ఆ వివరాలివే..
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
వీడియో ఇలా..
స్క్విడ్ గేమ్ ఇండియా అంటూ ఈ ఏఐ వీడియో ఉంది. సినీ స్టార్ హీరోలు స్క్విడ్ గేమ్ ప్లేయర్లుగా ఉంటే ఎలా ఉంటారనే ఊహతో ఈ వీడియో క్రియేట్ అయింది. ప్లేయర్ల నంబర్లతో ఉన్న డ్రెస్‍లు ధరించి ఈ ఏఐ వీడియోలో హీరోలు ఉన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్‍చరణ్, అల్లు అర్జున్, నాగార్జున, విజయ్ దేవరకొండ సహా మరికొందరు టాలీవుడ్ స్టార్ హీరోలు.. స్క్విడ్ గేమ్ ప్లేయర్ల డ్రెస్‍లు ధరించినట్టుగా ఈ ఏఐ వీడియో ఉంది. తమిళ దిగ్గజ నటులు రజినీకాంత్, కమల్ హాసన్‍తో పాటు దళపతి విజయ్, సూర్య, విజయ్ సేతుపతి కూడా ఈ వీడియోలో ఉన్నారు.
మమ్ముట్టి, హృతిక్ రోషన్, యశ్, దుల్కర్ సల్మాన్ సహా మరికొందరు స్టార్ హీరోల ఏఐ రూపాలు ఈ స్క్విడ్ గేమ్ ఇండియా వీడియోలో ఉన్నాయి. భారత చెస్ స్టార్ ప్లేయర్లు గుకేశ్, ప్రజ్ఞానంద కూడా ఏఐ వీడియోలో ఉన్నారు.
విపరీతంగా వైరల్
స్క్విడ్ గేమ్ ఇండియా అంటూ స్టార్లతో ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో అద్భుతంగా ఉందని, రియలస్టిక్‍గా అనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో క్రియేట్ చేసిన వారికి అవార్డు ఇవ్వాల్సిందేని అంటున్నారు. ఆయా హీరోల అభిమానులు కొందరు స్క్రీన్ షాట్లను పోస్ట్ చేస్తున్నారు. మొత్తంగా ఈ ఏఐ వీడియో నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ చిన్నపిల్లలు ఆడే ఆటలతో సీరియస్‍గా సాగుతుంది. అయితే, గేమ్‍లో ఓడిపోయిన ప్లేయర్లను నిర్వాహకులు చంపేస్తుంటారు. ఉత్కంఠభరితంగా ఈ సిరీస్ సాగుతుంటుంది. దీంతో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఫస్ట్ సీజన్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. గత నెలలో వచ్చిన రెండో సీజన్ కూడా అదే రేంజ్‍లో అదరగొడుతోంది. ఇప్పటికే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ గ్లోబల్ రేంజ్‍లో టాప్‍లో ట్రెండ్ అవుతోంది. కొరియన్, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.