Unstoppable 4: ప్రభాస్ పెళ్లి చేసుకునేది గణపవరం అమ్మాయిని, రామ్ చరణ్ చెప్పాడన్న బాలయ్య- అన్‌స్టాపబుల్ 4 లేటెస్ట్ ప్రోమో-prabhas marriage bridal belongs to ganapavaram said ram charan by balakrishna in unstoppable s4 latest promo of aha ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Unstoppable 4: ప్రభాస్ పెళ్లి చేసుకునేది గణపవరం అమ్మాయిని, రామ్ చరణ్ చెప్పాడన్న బాలయ్య- అన్‌స్టాపబుల్ 4 లేటెస్ట్ ప్రోమో

Unstoppable 4: ప్రభాస్ పెళ్లి చేసుకునేది గణపవరం అమ్మాయిని, రామ్ చరణ్ చెప్పాడన్న బాలయ్య- అన్‌స్టాపబుల్ 4 లేటెస్ట్ ప్రోమో

Sanjiv Kumar HT Telugu
Jan 13, 2025 01:38 PM IST

Ram Charan Unstoppable With NBK S4 Latest Promo: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 సంక్రాంతి స్పెషల్ మెగా ఎపిసోడ్‌కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన సరికొత్త ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.

ప్రభాస్ పెళ్లి చేసుకునేది గణపవరం అమ్మాయిని, రామ్ చరణ్ చెప్పాడన్న బాలయ్య- అన్‌స్టాపబుల్ 4 లేటెస్ట్ ప్రోమో
ప్రభాస్ పెళ్లి చేసుకునేది గణపవరం అమ్మాయిని, రామ్ చరణ్ చెప్పాడన్న బాలయ్య- అన్‌స్టాపబుల్ 4 లేటెస్ట్ ప్రోమో (YouTube/Aha OTT)

Ram Charan Balakrishna Unstoppable S4 Episode Latest Promo: బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 షోకు సంక్రాంతి సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్‌గా హాజరు కానున్నాడు. ఈ నేపథ్యంలో అన్‌స్టాపబుల్ సీజన్ 4 మెగా సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ లేటెస్ట్ ఎపిసోడ్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

yearly horoscope entry point

ఒకరు మిస్ అయ్యారు

మూడు నిమిషాల 47 సెకండ్స్ ఉన్న అన్‌స్టాపబుల్ 4 లేటెస్ట్ ప్రోమోలో బాబాయ్ మ్యానిరజం చూపించమని బాలయ్య అడిగితే రామ్ చరణ్ అలాగే చేసి చూపించాడు. తర్వాత పవన్ కల్యాణ్‌తో తన కూతురుతో రామ్ చరణ్ ఉన్న ఫొటోను స్క్రీన్‌పై చూపించారు. అందులో ఒకరు మిస్ అయ్యారని బాలకృష్ణ అడిగితే.. అకీరా నందన్ అని రామ్ చరణ్ చెప్పాడు. దాంతో వెంటనే అకీరా నందన్‌ను ఆ పిక్‌లో చూపించారు.

లాంచింగ్ ఎప్పుడో చెప్పేశాడు

అది చూసి అక్కడున్న ఆడియెన్స్ అంతా ఒక్కసారిగా లేచి నిల్చున్నారు. లాంచింగ్ ఎప్పుడో చెప్పమ్మా అని అకీరా నందన్ సినిమా ఎంట్రీ గురించి బాలయ్య అడిగినట్లు తెలుస్తోంది. దాంతో రామ్ చరణ్ చెప్పింది మ్యూట్ చేశారు. కానీ, లాంచ్ డేట్ చెప్పేశాడు అని బాలయ్య అన్నాడు. తర్వాత ఉపాసనతో ఉన్న ఫొటో చూపించి మీ మనసులు ఎలా కలిశాయో అడిగాడు బాలకృష్ణ. మొదట్లో పెద్దగా మాట్లాడుకునేవాళ్లం కాదు. తర్వాత ఏమైందో తెలియదు అలా పడిపోయాను అని రామ్ చరణ్ చెప్పాడు.

పిలిచే టోన్ మారుతుంది

నిన్ను ప్రేమగా ఏమని పిలుస్తుంది ఉపాసన అని బాలయ్య అంటే.. రామ్ చరణ్ అని చెర్రీ చెప్పాడు. మరి కోపం వస్తే అని అంటే.. ఆ పిలుపు టోన్ మారుతుందని చెర్రీ అన్నాడు. దాంతో సీరియస్‌గా ఉపాసన టోన్‌లో బాలయ్య చెప్పాడు. దాంతో అంతా నవ్వేశారు. తర్వాత సుస్మిత కొణిదెల ఒక లెటర్ పంపినట్లు చెబుతుంది. తర్వాత ప్రభాస్‌తో కాల్ మాట్లాడుతాడు బాలయ్య.

గణపవరం అమ్మాయి

ప్రభాస్ గణపవరం అమ్మాయిని చేసుకుంటున్నాడని రామ్ చరణ్ చెప్పాడు అని బాలయ్య అన్నాడు. దాంతో గణపవరం అమ్మాయ. ఎక్కడ దొరికింది. యూరప్‌లోనా అని ప్రభాస్ అన్నాడు. దాంతో రామ్ చరణ్ తెగ నవ్వేశాడు. ఇది నీకు అన్‌కట్ వెర్షన్ పంపిస్తాను. దాంతో మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్ది అని బాలకృష్ణ అన్నాడు. దాంతో అంతా నవ్వేశారు. తర్వాత మీ నాన్న నిన్ను ఎప్పుడైనా ఒక్కటి వేశాడా (కొట్టాడా) అని బాలయ్య అడిగాడు.

నాగ బాబాయ్ వల్లే

నాకు తెలిసి లైఫ్‌లో ఒక్కసారే కొట్టారు. అది కూడా మా నాగ బాబాయ్ వల్ల. ఆయనే పెట్టారు ఫిటింగ్ అని రామ్ చరణ్ అన్నాడు. తెలుసు.. తెలుసమ్మా మీ నాగబాబు సంగతి తెలుసు అని బాలకృష్ణ అన్నాడు. తర్వాత రామ్ చరణ్ ఫ్రెండ్స్ శర్వానంద్, మరొకరు వచ్చారు. వాళ్లతో మరింతగా ఫన్ జెనరేట్ చేశాడు బాలకృష్ణ.

Whats_app_banner

సంబంధిత కథనం