Brahma Anandam Trailer: తాతా మనవళ్లుగా తండ్రీకొడుకులు.. ప్రభాస్ రిలీజ్ చేసిన బ్రహ్మా ఆనందం ట్రైలర్ చూశారా?
Brahma Anandam Trailer: బ్రహ్మా ఆనందం మూవీ ట్రైలర్ వచ్చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ట్రైలర్ లాంచ్ చేశాడు. తొలిసారి తండ్రీకొడుకులు బ్రహ్మానందం, రాజా గౌతమ్ కలిసి నటిస్తున్న సినిమా ఇది. అయితే స్క్రీన్ పై వీళ్లు తాతా మనవళ్లుగా కనిపించనుండటం విశేషం.

Brahma Anandam Trailer: బ్రహ్మానందం, అతని తనయుడు రాజా గౌతమ్ నటిస్తున్న మూవీ బ్రహ్మా ఆనందం. ఆర్వీఎస్ నిఖిల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ సోమవారం (ఫిబ్రవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ ఈ ట్రైలర్ చేయడం విశేషం. వెన్నెల కిశోర్ కూడా కీలకపాత్ర పోషించిన ఈ మూవీ ట్రైలర్ నవ్విస్తూనే భావోద్వేగానికి గురి చేసేలా సాగింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కింద రాహుల్ యాదవ్ నక్కా మూవీని నిర్మిస్తున్నాడు.
బ్రహ్మా ఆనందం ట్రైలర్ ఎలా ఉందంటే?
బ్రహ్మా ఆనందం మూవీ ట్రైలర్ ను సోమవారం (ఫిబ్రవరి 10) ప్రభాస్ డిజిటల్ గా లాంచ్ చేశాడు. రాజా గౌతమ్ మూవీలో లీడ్ రోల్ పోషించాడు. ఈ ట్రైలర్ అదిరిపోయిందంటూ ప్రభాస్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేశాడు. "బ్రహ్మానందం గారు.. మీరుంటే చాలు అదొక లాఫర్ థెరపీ అవుతుంది.. ట్రైలర్ సూపర్ ఫన్ గా ఉంది.
బ్రహ్మానందం సర్ ఇన్‌స్టాగ్రామ్ లోకి స్వాగతం" అని ప్రభాస్ అన్నాడు. రెబల్ స్టార్ చెప్పినట్లే ఈ బ్రహ్మా ఆనందం మూవీ ట్రైలర్ నవ్విస్తూనే భావోద్వేగానికి గురి చేసేలా సాగింది. ఈ సినిమాలో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్.. తాతామనవళ్లుగా నటిస్తున్నారు. ఓ థియేటర్ ఆర్టిస్టుగా ఉంటూ మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న పాత్రలో రాజా గౌతమ్ నటించాడు.
ఢిల్లీలో ఓ ఈవెంట్లో నటిస్తే తన దశ తిరిగి పోతుందని ఆశ పడినా.. దాని కోసం ఆరు లక్షలు అవసరం కావడంతో అతడు ఉసూరుమంటాడు. ఈ సమయంలో బ్రహ్మానందం పాత్ర తనకు మనవడిగా ఉంటే తన ఆరు ఎకరాల భూమి రాసిస్తానని అంటాడు. అయితే దీనికోసం కొన్ని షరతులు విధిస్తాడు.
వాటిని అతడు నిలబెట్టుకుంటాడా? ఆ తాతకు మనవడిగా సక్సెస్ అవుతాడా లేదా అన్నది మూవీలో చూడొచ్చు. ఈ ట్రైలర్ మొదట, చివర్లో మాత్రమే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. మిగిలిన ట్రైలర్ మొత్తం కామెడీయే.
తండ్రీకొడుకులు జీవించేశారు
నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ఈ బ్రహ్మా ఆనందం సినిమాలో మాత్రం తాతా మనవళ్లుగా జీవించేసినట్లు ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతోంది. బ్రహ్మానందం ఉంటే కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అతనికి వెన్నెల కిశోర్ కూడా తోడైతే మరో లెవెలే. ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది.
మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం (ఫిబ్రవరి 11) జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ కు రాబోతున్నాడు. ఈ బ్రహ్మా ఆనందం సినిమాలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, రఘు బాబులాంటి వాళ్లు నటిస్తున్నారు.
సంబంధిత కథనం