Prabhas Kriti Sanon Relationship: ప్రభాస్‌, కృతి సనన్‌ రిలేషన్‌షిప్‌ నిజమేనా.. ఇదీ లేటెస్ట్‌ అప్‌డేట్‌-prabhas kriti sanon relationship rumours are baseless says actress close aides
Telugu News  /  Entertainment  /  Prabhas Kriti Sanon Relationship Rumours Are Baseless Says Actress Close Aides
కృతి సనన్‌తో ప్రభాస్ డేటింగ్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్
కృతి సనన్‌తో ప్రభాస్ డేటింగ్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Prabhas Kriti Sanon Relationship: ప్రభాస్‌, కృతి సనన్‌ రిలేషన్‌షిప్‌ నిజమేనా.. ఇదీ లేటెస్ట్‌ అప్‌డేట్‌

29 November 2022, 22:03 ISTHT Telugu Desk
29 November 2022, 22:03 IST

Prabhas Kriti Sanon Relationship: ప్రభాస్‌, కృతి సనన్‌ రిలేషన్‌షిప్‌ నిజమేనా? ఇప్పుడు ఫ్యాన్స్‌ అందరిలో తలెత్తుతున్న ప్రశ్న ఇదే. వీళ్ల బంధం నిజమే అనేలా ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలతో పుకార్లు కాస్తా బలపడ్డాయి. కానీ ఇందులో నిజమెంత?

Prabhas Kriti Sanon Relationship: సినిమా ఫీల్డ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య ఏడో నడుస్తోందనే రూమర్లు ఇప్పటివి కావు. సినిమా షూటింగ్‌ సందర్భంగా కాస్త చనువుగా కనిపిస్తే చాలు ఎన్నో పుకార్లు బయటకు వచ్చేస్తాయి. తాజాగా పాన్‌ ఇండియా రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ మధ్య కూడా ఏదో జరుగుతోందన్న వార్తలు వస్తున్నాయి.

ఈ మధ్య బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ ఓ షోలో చేసిన కామెంట్స్‌ వీటిని మరింత బలపరిచాయి. అతడు ప్రభాస్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. కృతి మనసులో ఒకరున్నారు.. ఆ వ్యక్తి ప్రస్తుతం దీపికా పదుకోన్‌తో కలిసి షూటింగ్‌ చేస్తున్నాడని అన్నాడు. ఇది విన్న కృతి ఆ షోలోనే సిగ్గుపడింది. దీంతో ఈ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌ నిజమే అని, ఇక పెళ్లే తరువాయి అన్నట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం సాగింది.

అయితే తాజాగా కృతి సనన్‌ సన్నిహితులు దీనిపై స్పందించారు. ఇవన్నీ ఉత్త పుకార్లే అని వాళ్లు తేల్చేశారు. ఓ వెబ్‌సైట్‌తో కృతి సన్నిహితులు మాట్లాడుతూ.. "వరుణ్‌, కృతి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకరిని మరొకరు టీజ్‌ చేసుకుంటూ ఉంటారు. కృతిని ఆ షోలో వరుణ్‌ టీజ్‌ చేయడం కూడా అలాంటిదే. ఈ పుకార్లు నిరాధారమైనవని వరుణ్‌కు కూడా బాగా తెలుసు. కృతి, ప్రభాస్‌ ఒకరికొరు కలవడం లేదు. కలిసి పని చేసిన నటులుగా ఇద్దరి మధ్యా ఫ్రెండ్‌షిప్ ఉంది. ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటారు. అది అంత వరకే" అని స్పష్టం చేశారు.

ప్రభాస్‌, కృతి కలిసి ఆదిపురుష్‌ మూవీలో నటించారు. ఈ సినిమా టీజర్‌ లాంచ్ వేడుకలో వీళ్ల మధ్య కెమెస్ట్రీ కూడా పుకార్లకు ఊతమిచ్చాయి. ఆ ఈవెంట్‌లో ప్రభాస్‌కు చెమటలు పడుతుంటే.. కృతి తన చున్నీ ఇవ్వడానికి ప్రయత్నించిన వీడియో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఆదిపురుష్‌ మూవీలో ప్రభాస్‌ రాముడిగా, కృతి సీతగా నటించారు.

ఇక ఇటు కృతి, వరుణ్‌ ధావన్‌ కలిసి ఈ మధ్యే భేడియా మూవీలో కనిపించిన విషయం తెలిసిందే. తెలుగులోనూ తోడేలు పేరుతో ఈ సినిమా రిలీజ్‌ అయింది. బాక్సాఫీస్‌ దగ్గర భేడియా మంచి సక్సెస్‌ సాధించింది. భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది.