Prabhas: ప్రభాస్ మోకాలి సర్జరీ సక్సెస్.. వైద్యులు ఇంకా ఏం చెప్పారంటే?-prabhas knee surgery success and doctor advises to take rest for one month ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas Knee Surgery Success And Doctor Advises To Take Rest For One Month

Prabhas: ప్రభాస్ మోకాలి సర్జరీ సక్సెస్.. వైద్యులు ఇంకా ఏం చెప్పారంటే?

Sanjiv Kumar HT Telugu
Sep 27, 2023 03:03 PM IST

Prabhas Knee Surgery: పాన్ ఇండియా ప్రభాస్ అంటే తన అభిమానులకు ఎంత పిచ్చో తెలిసిందే. తాజాగా వారికి గుడ్ న్యూస్ వచ్చింది. ప్రభాస్ మోకాలి సర్జరీ సక్సెస్ అయినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వైద్యులు ఇంకా ఏం చెప్పారనే వివరాల్లోకి వెళితే..

ప్రభాస్ మోకాలి సర్జరీ సక్సెస్.. వైద్యులు ఇంకా ఏం చెప్పారంటే?
ప్రభాస్ మోకాలి సర్జరీ సక్సెస్.. వైద్యులు ఇంకా ఏం చెప్పారంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ, ఈ మూవీ అంతగా ఆడియెన్స్, ప్రభాస్ అభిమానులు ఊహించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలపైనే ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నారు. నిజానికి రేపు అంటే సెప్టెంబర్ 28న సలార్ మూవీ విడుదల కావాల్సింది. కానీ, అనివార్య కారణాలతో వాయిదా పడింది.

ట్రెండింగ్ వార్తలు

బెస్ట్ ఔట్‍పుట్ కోసమే సలార్ విడుదల వాయిదా వేస్తున్నట్లు హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి ఏడీ 2898 మూవీ సైతం వచ్చే ఏడాదికి వెళ్లిపోయింది. 2024లో జనవరిలో సంక్రాంతికి లేదా.. వేసవి సెలవుల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇవే కాకుండా స్పిరిట్, రాజా డీలక్స్ (వర్కింగ్ టైటిల్), పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‍తో ఓ మూవీ చేస్తున్నాడు ప్రభాస్.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ విదేశీ పర్యటనలో ఉన్నాడు. డార్లింగ్ మోకాలి గాయం కారణంగా శస్త్ర చికిత్స కోసం యూరప్ వెళ్లాడు. ఇప్పుడు ఆ మోకాలి సర్జరీ సక్సెస్‍ఫుల్‍గా పూర్తి అయినట్లు సమాచారం. మోకాలీ సర్జరీ కారణంగా ప్రభాస్‍ను సుమారు నెల రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారట. అప్పటివరకు యూరప్‍లోనే ప్రభాస్ రెస్ట్ తీసుకోనున్నాడని సమాచారం.

అక్టోబర్ చివరి వారంలో ప్రభాస్ తిరిగి ఇండియాకు రానున్నట్లు తెలుస్తోంది. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్స్ లలో ప్రభాస్ పాల్గొంటాడని సమాచారం. కాగా బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో నెలల తరబడి యాక్షన్ సీన్స్ చేయడంతో ప్రభాస్‍ మోకాలికి నొప్పి వచ్చింది. ఆ మధ్య టెంపరరీ ట్రీట్‍మెంట్ తీసుకుని షూటింగ్స్ చేశాడు. ఆదిపురుష్, సలార్‍లను మోకాలి నొప్పితోనే కంప్లీట్ చేశాడు. ఇటీవల నొప్పి మరింత ఎక్కువయ్యేసరికి సర్జరీ చేయించుకున్నాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.