Kalki 2898 AD: కల్కి మూవీ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్స్, ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ
Prabhas Kalki Sequel: ప్రభాస్ కల్కి మూవీ సీక్వెల్ గురించి ఎట్టకేలకి ఆ సినిమా నిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారు. ఈ ఏడాది జూన్‌లో వచ్చిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1100 కోట్ల వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.
ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ ఈ ఏడాది జూన్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లని రాబట్టింది. దాంతో సీక్వెల్‌పై అప్పుడే ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కల్కి 2898 ఏడీ మూవీ సీక్వెల్‌పై నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంక దత్‌లు తాజాగా క్లారిటీ ఇచ్చారు.
సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుంది?
‘‘కల్కి 2898 ఏడీ సీక్వెల్ షూటింగ్ వచ్చే ఐదారు నెలల్లో అంటే 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. షూటింగ్ ప్రారంభమైన తర్వాతే సీక్వెల్ గురించి క్లారిటీగా చెప్పగలం’’ అని ప్రియాంక దత్ వెల్లడించారు.
కంగారు లేదు.. కానీ?
‘‘కల్కి 2898 ఏడీ మూవీ హిట్ కావడంతో కంగారు పోయి ఉత్సాహం పెరిగింది. కల్కి 2898 ఏడీ పార్ట్-1 కోసం మేమంతా నాగ్ అశ్విన్ విజన్ ప్రకారమే నడుచుకున్నాం. మీరు విజువల్స్ చూసే వరకు మీకు చాలా విషయాలు అర్థం కావు. ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న తీరును ఇప్పుడు అర్థం చేసుకున్నాం. కాబట్టి పూర్తి ఎనర్జీతో రెండో భాగాన్ని తెరకెక్కించబోతున్నాం'' అని స్వప్న దత్, ప్రియాంక దత్ చెప్పుకొచ్చారు
కల్కి 2898 ఏడీ గురించి
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటాని, బ్రహ్మానందం, శోభన, అనిల్ జార్జ్, సస్వతా ఛటర్జీ తదితరులు నటించారు. జూన్ నెలలో విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
సినిమాలో ప్రభాస్ మహాభారతంలోని కర్ణుడి పునర్జన్మ అయిన భైరవుడిగా నటించాడు. మహాభారతంలోని అమర జీవి అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్‌గా కమల్ హాసన్, ఎస్ యూఎం-80 అలియాస్ సుమతిగా దీపికా పదుకొణె నటించింది.
సైన్స్ ఫిక్షన్‌గా వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ 2024లో బిగ్గెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. క్రీ.శ.2898లో కాశీలో ఓ సైన్స్ ల్యాబ్‌లో పుట్టబోయే బిడ్డ (కల్కి) చుట్టూ ఈ కథ నడిచింది. మూవీలో వాడిన విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రశంసలు దక్కాయి. సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.