Kalki 2898 AD: ఓవర్‌సీస్‌లో కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ - హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్న టికెట్స్
Kalki 2898 AD:ప్రభాస్ కల్కి 2898 ఏడీ ఓవర్‌సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ గురువారం ఓపెన్ అయ్యాయి. ఒక్కరోజులోనే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ మూవీ కోటి పది లక్షలకుపైగా వసూళ్లను రాబట్టింది. కల్కి మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది
Kalki 2898 AD:ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్‌తో సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తోన్నారు. ప్రభాస్ కల్కి రిలీజ్‌కు ఇరవై రోజులే టైమ్ ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడును పెంచుతోన్నారు. ఈ నెల 10న కల్కి 2898 ఏడీ ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నారు.
ఓవర్‌సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్...
కల్కి 2898 ఏడీ ఓవర్‌సీస్ ప్రీమియర్స్ ఓ రోజు ముందుగానే అనగా జూన్ 26నే పడబోతున్నాయి. ఓవర్‌సీస్ ప్రీమియర్స్‌కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ గురువారం ఓపెన్ అయ్యాయి. ఓవర్‌సీస్‌లో కల్కి మూవీకి ఫుల్ క్రేజ్ ఉండటంతో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే ఓవర్‌సీస్‌లోని చాలా స్క్రీన్స్‌లో టికెట్లు మొత్తం అమ్ముడుపోయినట్లు సమాచారం.
ఓవర్‌సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన నాలుగు గంటల్లోనే 4200 కల్కి మూవీ టికెట్స్ అమ్ముడుపోయాయి. ఈ టికెట్ల అమ్మకాల ద్వారా లక్ష ముప్పై ఐదు వేల అమెరికన్ డాలర్స్ వచ్చాయి. ఇండియన్ కరెన్సీలో తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కల్కి 2898 ఏడీ మూవీ కోటి పది లక్షల వసూళ్లను రాబట్టింది. ఒక్క రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు మూవీగా కల్కి రికార్డ్ క్రియేట్ చేసింది. శుక్రవారం అడ్వాన్స్ బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
కేజీఎఫ్ 2 రికార్డును బ్రేక్ చేస్తుందా?
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 80 కోట్లతో యశ్ కేజీఎఫ్ 2 అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. 59 కోట్లతో ఆర్ఆర్ఆర్ సెకండ్ ప్లేస్‌లో నిలవగా... ప్రభాస్ సలార్ 49 కోట్లతో మూడో స్థానంలో ఉంది. కేజీఎఫ్ 2 రికార్డును కల్కి అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిలీజ్‌కు ఇంకో ఇరవై రోజులు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కావడం కూడా కల్కి కలిసివచ్చే అవకాశం ఉందని చెబుతోన్నారు.
కమల్‌హాసన్ విలన్...
కల్కి 2898 ఏడీలో విలక్షణ నటుడు కమల్‌హాసన్ విలన్‌గా నటిస్తోన్నారు. కల్కి కోసం కమల్‌హాసన్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ విలన్‌గా మారాడు. .ఈ మూవీలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రభాస్‌కు జోడీగా దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. కల్కి మూవీతోనే దీపికా పడుకోణ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో భైరవ అనే పాత్రలో ప్రభాస్ కనిపించబోతుండగా...అశ్వత్థామగా అమితాబ్, కాళీగా కమల్‌హాసన్ నటిస్తున్నారు
కల్కి అవతారం స్ఫూర్తితో...
పురాణాల్లోని కల్కి అవతారం గాథ నుంచి స్ఫూర్తి పొందుతూ సూపర్ హీరో మూవీగా హాలీవుడ్ స్టైల్‌లో దర్శకుడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి మూవీని తెరకెక్కిస్తోన్నాడు. దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ పతాకంపై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఈ మూవీని నిర్మిస్తోన్నాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా కల్కి తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీని షూట్ చేశారు. తమిళ్, మలయాళం, కన్నడంతో పాటు ఇంగ్లీష్ భాషల్లోకి డబ్ చేసి విడుదలచేయబోతున్నారు.
సలార్ సీక్వెల్...
డిసెంబర్ రిలీజైన ప్రభాస్ సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద 600 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి సీక్వెల్ రాబోతోంది. సలార్ 2 శౌర్యంగపర్వం పేరుతో రూపొందుతోన్న ఈ మూవీ ఆగస్ట్‌లో సెట్స్‌పైకి రానుంది. సలార్ సీక్వెల్‌తో పాటు డైరెక్టర్ మారుతితో రాజాసాబ్ సినిమా చేస్తోన్నాడు ప్రభాస్. ఈ రెండు సినిమాలతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ కూడా చేస్తున్నాడు.