Kalki 2898 AD Copy: కల్కి 2898 ఏడీ ఆ మూవీకి కాపీనా? ట్రైలర్‌తో బయటపడిన నిజం!
Kalki 2898 AD Copied From Alita Battle Angel: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తోన్న కల్కి 2898 ఏడీ మూవీ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ అలిటా బ్యాటిల్ ఏంజెల్ సినిమాకు కాపీ అని రూమర్స్ వస్తున్నాయి. ఇటీవల విడుదలైన కల్కి 2898 ఏడీ ట్రైలర్‌తో అసలు విషయం బయటపడింది.
Prabhas Kalki 2898 AD Copy: ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రాల్లో కల్కి 2898 ఏడీ ఒకటి. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశస్థాయిలో ఉన్నాయి. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో కల్కి చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సుమారు రూ. 500 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, కల్కి 2898 ఏడీ మూవీకి కాపీ సెగ అంటుకుంది. ఈ సినిమా పలు చిత్రాలను స్ఫూర్తిగా తీసుకుని కాపీ కొట్టారంటూ రూమర్స్ బాగానే వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల మే 30న నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ వెబ్ సిరీస్ విడుదలైంది. ఈ కల్కి 2898 ఏడీ ప్రీల్యూడ్ యానిమేషన్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోన్నప్పటినుంచి ఈ కాపీ రూమర్స్ ఊపందుకున్నాయి.
ఇక ఈ బుజ్జి అండ్ భైరవ సిరీస్ చూసి చాలా మంది కల్కి 2898 ఏడీ సినిమా 2019లో వచ్చిన హాలీవుడ్ చిత్రం అలిటా బ్యాటిల్ ఏంజెల్‌కి (Alita Battle Angel) కాపీ అని కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో ఈ రెండింటికి కంపేరిజన్ మొదలైంది. కల్కి మూవీ స్టోరీ 2898లో జరిగితే.. అలిటా సినిమా కథ 20533లో జరుగుతుంది. ఈ రెండు సినిమాల్లోని ఫీచర్ ఎలిమెంట్స్ చూస్తే కాస్తా సిమిలారిటీస్ కనిపిస్తాయి.
అలిటా మూవీలో ఐరన్ సిటీ అండ్ జాలన్, కల్కిలో కాశీ అండ్ కాంప్లెక్స్ సేమ్ ఉంటాయి. అలాగే కల్కి బుజ్జి ఎలాగో అక్కడ అలిటా రోబోట్ అలాగే అని టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ రెండు మూడు సిమిలారిటీస్‌ను పట్టుకుని ఇండియన్ సినిమాను ప్రపంచానికి చాటి చెప్పేందుకు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి కాపీ అనడం కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇటీవల విడుదలైన కల్కి 2898 ఏడీ ట్రైలర్ చూస్తే ఆ సినిమాకు అలిటా మూవీకి ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. బుజ్జి అండ్ భైరవ యానిమేషన్‌లో ఉండటం, అలిటా కూడా కాస్తా అలాంటి తరహాలోనే కనిపించడంతో దానికి కాపీ అనే టాపిక్ స్టార్ట్ అయింది. కానీ, కల్కి ట్రైలర్ ద్వారా ప్రభాస్ చిత్రానికి హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ అలిటాకు ఎలాంటి మ్యాచ్ లేదని అభిమానులు వాదిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ట్రైలర్ విడుదలైన తర్వాత చాలా మంది దాని బ్రేక్ డౌన్ చేస్తూ వార్తలు దర్శనం ఇచ్చాయి. అందులో హాలీవుడ్‌లోని చాలా సినిమాల ఛాయలు కల్కిలో ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల ఆస్కార్ అవార్డ్ పొందిన డ్యూన్ నుంచి బ్లేడ్ మూవీ వరకు ఎన్నో సీన్స్ రిప్రజెంట్‍గా ఉన్నాయని ఆ వార్తల సారాంశం.
ఎవరు ఏది అనుకున్నా కల్కి 2898 ఏడీ సినిమా మాత్రం ఇండియన్ మైథాలజీలోని కల్కి అవతారాన్ని బేస్ చేసుకుని ఫ్యూచరిస్టిక్ మోడ్రన్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కించారు నాగ్ అశ్విన్. జూన్ 27న విడుదల కానున్న ఈ సినిమాను చూస్తే తప్పా ఈ కాపీ టాపిక్‌పై స్పష్టత వచ్చేలా లేదు.
టాపిక్