The Raja Saab Release: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ రిలీజ్ అప్పుడేనా! లేటెస్ట్ బజ్ ఇదే-prabhas horror romantic comedy movie the raja saab release latest buzz update ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Raja Saab Release: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ రిలీజ్ అప్పుడేనా! లేటెస్ట్ బజ్ ఇదే

The Raja Saab Release: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ రిలీజ్ అప్పుడేనా! లేటెస్ట్ బజ్ ఇదే

The Raja Saab Release: ది రాజాసాబ్ సినిమా వాయిదా పడడం ఖాయమైంది. అయితే, ఎప్పుడు వస్తుందనేది ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. ఈ తరుణంలో ఈ చిత్రాన్ని మేకర్స్ ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారో సమాచారం వెల్లడైంది.

The Raja Saab Release: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ రిలీజ్ అప్పుడేనా! లేటెస్ట్ బజ్ ఇదే

‘ది రాజా సాబ్’ చిత్రంపై హైప్ విపరీతంగా ఉంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఈ మూవీ ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ తొలిసారి హారర్ కామెడీ జానర్ సినిమా చేస్తుండటంతో హైప్ మరింత ఎక్కువగా ఉంది. మారుతీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వింటేజ్ ప్రభాస్ కనిపిస్తారనే టాక్ ఉంది. ఏప్రిల్ 10వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే, ఆ తేదీ నుంచి వాయిదా పడడం ఖాయమైంది. దీంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయితే, ది రాజాసాబ్ మూవీ రిలీజ్ ప్లాన్‍ను మేకర్స్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

రిలీజ్ ఎప్పుడంటే!

‘ది రాజాసాబ్’ చిత్రాన్ని ఆగస్టు నెల మధ్యలో విడుదల చేయాలని టీమ్ నిర్ణయించిందని సమాచారం బయటికి వచ్చింది. ఆగస్టు 15వ తేదీని పరిశీలిస్తున్నట్టు రూమర్లు బయటికి వచ్చాయి. ఆగస్టు రిలీజ్ అంటూ త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని బజ్ బయటికి వచ్చింది.

వాయిదా కారణం ఇదే!

ది రాజా సాబ్ షూటింగ్ ఇంకా మిగిలే ఉంది. కొన్ని పాటలతో పాటు క్లైమాక్స్ షూటింగ్ కూడా ఇంకా పెండింగ్‍లోనే ఉందని తెలుస్తోంది. దీంతో వాయిదా తప్పలేదు. వీఎఫ్‍ఎక్స్ పనులకు కూడా మరింత సమయం కావాలని టీమ్ భావిస్తోంది. దీంతో ఏప్రిల్ 10 నుంచి ఈ చిత్రం వాయిదా పడింది. సమ్మర్ రిలీజ్ మిస్ అయింది. కొత్త విడుదల తేదీని ది రాజాసాబ్ మూవీ టీమ్ ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.

ది రాజాసాబ్ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, రిధి కుమార్, అనుపమే ఖేర్ కీలకపాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని మారుతీ ఫుల్ ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్లతో హారర్ చిత్రంగా రూపొందిస్తున్నారు.

ది రాజాసాబ్ చిత్రం సుమారు రూ.200కోట్ల బడ్జెట్‍తో రూపొందుతోందని అంచనా. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్ సాంగ్స్ ఉంటాయని, ప్రభాస్ ఫుల్ జోష్‍తో డ్యాన్స్ చేస్తారని థమన్ వెల్లడించారు. ఇది ఈ చిత్రంపై క్యూరియాసిటీని మరింత పెంచేసింది.

ప్రభాస్ ప్రస్తుతం డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియడ్ యాక్షన్ డ్రామా మూవీ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీని నెక్స్ట్ చేయనున్నారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనూ ఓ మూవీకి ప్రభాస్ గ్రీన్‍సిగ్నల్ ఇచ్చేశారు. సలార్ 2, కల్కి 2 చిత్రాలు కూడా లైనప్‍లో ఉన్నాయి.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం