Prabhas furious over Om Raut: ఆదిపురుష్ డైరెక్టర్‌పై ప్రభాస్ సీరియస్.. వైరల్ అవుతున్న వీడియో
Prabhas furious over Om Raut: ఆదిపురుష్ డైరెక్టర్‌పై ప్రభాస్ సీరియస్ అయ్యాడా? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది.
Prabhas furious over Om Raut: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మచ్ అవేటెడ్ మూవీ ఆదిపురుష్. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ మూవీ ఇండియన్ సినిమా హిస్టరీలో మిగిలిపోతుందన్న అంచనాల్లో అభిమానులు ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజరే తుస్సుమనిపించాయి. ఇంత భారీ ప్రాజెక్ట్ నుంచి మరీ ఇంత నాణ్యత లేని, కాపీ కొట్టిన టీజరా అంటూ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు.
ఆదిపురుష్ టీజర్ రిలీజై మూడు రోజులవుతున్నా.. ఇప్పటికీ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా #boycottadipurush కూడా ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా డైరెక్టర్ ఓంరౌత్‌పై ప్రభాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడంటూ ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎప్పుడూ కూల్‌గా, నవ్వుతూ కనిపించే ప్రభాస్.. ఈ వీడియోలో చాలా కోపంలో ఉన్నట్లు కనిపించాడు.
"ఓం.. నువ్వు నా రూమ్‌కు వస్తున్నావ్ కదా.. ఓం నాతో రా" అంటూ ప్రభాస్ రెట్టించిన స్వరంతో డైరెక్టర్‌ను పిలవడం ఈ వీడియోలో చూడొచ్చు. నేను వస్తాను అంటూ మరోవైపు నుంచి ఓంరౌత్ గొంతు వినిపిస్తుంది. టీజర్‌పై ఫ్యాన్స్ నుంచి వస్తున్న ట్రోల్స్‌తో అసంతృప్తిగా ఉన్న ప్రభాస్.. డైరెక్టర్‌పై ఇలా ఆగ్రహం వెల్లగక్కాడంటూ ఈ వీడియోను కొందరు ఫ్యాన్స్ వైరల్‌గా మార్చేశారు.
ఆదిపురుష్ టీజర్ లాంచ్ తర్వాత ఈ ఘటన జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ ఆదిపురుష్‌లో ప్రభాస్.. రాముడిగా కనిపిస్తుండగా.. కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 12, 2023న రిలీజ్ చేయనున్నారు. అయితే రాముడిగా ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడే ఫ్యాన్స్ పెదవి విరిచారు.
ఇక టీజర్ తర్వాత వాళ్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రామాయణాన్ని హేళన చేసేలా ఈ మూవీ టీజర్ ఉందని కొందరు ఫైరయ్యారు. ఇక హాలీవుడ్ సినిమాలన్నింటినీ కలిపి కాపీ కొట్టి టీజర్ చేసినట్లుగా ఉందని మరికొందరు ఫొటోలతో సహా ఆరోపించారు. ఇందులోనీ వీఎఫ్‌ఎక్స్‌ను ట్రోల్ చేస్తూ మరీ కార్టూన్ మూవీ చూసినట్లుగా ఉందనీ అన్నారు.