Project k Prabhas First Look: 'ప్రాజెక్ట్ కే' నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. సూపర్ హీరోలా..
Project k Prabhas First Look: ప్రభాస్ ఫ్యాన్స్ లాంగ్ వెయిటింగ్‌కు ప్రాజెక్ట్ కే టీమ్ తెరదించింది. ప్రభాస్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫస్ట్‌లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Project k Prabhas First Look: ప్రాజెక్ట్ కే నుంచి ఊహించని సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఈ మూవీలో హీరో ప్రభాస్ ఫస్ట్‌లుక్‌ను బుధవారం (జూలై 19) రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో సూపర్ హీరోలా, యోధుడిలా ప్రభాస్ కనిపిస్తోన్నాడు. లాంగ్ హెయిర్, జటాజూటం, సూపర్ హీరో డ్రెస్‍లో ప్రభాస్ లుక్ అదిరిపోయేలా, ఇంటెన్స్‌గా ఉంది. ఇండియన్ సూపర్ హీరో అనే మాటకు సరిగ్గా సూటయ్యేలా ప్రభాస్ ఫస్ట్ లుక్ ఉంది. ఈ పోస్టర్‌తో ప్రాజెక్ట్ కే చిత్రంపై అంచనాలు మరింత భారీగా పెరిగాయి. కాగా, ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్‌ను అమెరికాలోని శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్‌లో గురువారం (భారత కాలమానం ప్రకారం శుక్రవారం) రిలీజ్ చేయబోతోంది చిత్ర యూనిట్.

ఈ ఫస్ట్ గ్లింప్స్ ద్వారానే ప్రాజెక్ట్ కే అంటే అర్థమేమిటో రివీల్ చేయబోతోంది చిత్రయూనిట్. దాదాపు ఆరు వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ప్రాజెక్ట్ కే మూవీలో విలక్షణ నటుడు కమల్‌హాసన్‌తో పాటు బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రాజెక్ట్ కేతోనే దీపికా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది.
సూపర్ హీరో కథాంశంతో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే మూవీని తెరకెక్కిస్తోన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కల్కి భగవాన్ అవతారంలో కనిపించబోతున్నట్లు సమాచారం. మనిషి రూపాన్ని ధరించిన కల్కి భగవాన్ ఆధునిక యుగంలో దుష్ట శక్తులపై ఎలాంటి పోరాటం సాగించాడన్నది ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో నాగ్ అశ్విన్ ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది.
హాలీవుడ్ సూపర్ హీరో మూవీస్ స్టాండర్డ్స్‌కు ధీటుగా ప్రాజెక్ట్ కే మూవీ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రాజెక్ట్ కే రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్‌లోనూ ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి దసరా ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.
వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తోన్నాడు. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తోన్న మూవీ ఇది. మరోవైపు బాహుబలి -2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్‌గా నిలిచాయి. ప్రాజెక్ట్ కే పైనే ప్రభాస్ ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు.