Kannappa Prabhas: కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. రెబల్ స్టార్ పాత్ర ఏదంటే..
Prabhas first look from Kannappa: కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. నుదుటన నామాలతో సాధువులా ఈ లుక్ ఉంది. క్యారెక్టర్ ఏదో కూడా రివీల్ అయింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషిస్తున్న కన్నప్ప చిత్రంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించనున్నారు. ఈ మైథలాజికల్ చిత్రంలో ఓ కీలకపాత్ర చేస్తున్నారు. ప్రభాస్ ఉండటంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత విపరీతంగా ఉంది. ఈ చిత్రంలో ఆయన క్యారెక్టర్ ఏదోననే క్యూరియాసిటీ మొదటి నుంచి నెలకొంది. ఆ ఉత్కంఠ నేడు (ఫిబ్రవరి 3) వీడింది. కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. పాత్ర ఏదో కూడా తెలిసిపోయింది.

ప్రభాస్ లుక్ ఇలా..
కన్నప్ప చిత్రం నుంచి వచ్చిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. మెడలో రుద్రాక్ష మాలలు, చేతిలో కర్ర, నుదుటన మూడు నామాలు, తిలకంతో ఓ సాధువులా ప్రభాస్ లుక్ ఉంది. ఈ పోస్టర్ మరింత ఆసక్తిని పెంచేసింది.
రుద్ర పాత్రలో..
కన్నప్ప చిత్రంలో రుద్ర పాత్రను ప్రభాస్ పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఫస్ట్ లుక్ పోస్టర్లో మూవీ టీమ్ వెల్లడించింది. “ప్రళయకాల రుద్రుడు!, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు” అని రుద్ర క్యారెక్టర్ గురించి ఈ పోస్టర్‌పై ఉంది. అంటే మహాశివుడి అంశగా, ఆయన ఆదేశాలను పాటించేలా ఈ పాత్ర ఉంటుందని అర్థమవుతోంది. కన్నప్పకు సంరక్షకుడిగా రుద్ర ఉంటాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.
కన్నప్ప సినిమాలో ముందుగా శివుడి పాత్రను ప్రభాస్‍కే ఆఫర్ చేశారట మంచు విష్ణు. అయితే, ఆయన వేరే క్యారెక్టర్ చేస్తానని చెప్పారని విష్ణు గతంలో చెప్పారు. దీంతో ప్రభాస్‍ది ఓ క్యారెక్టర్ అయి ఉంటుందని చాలా రోజులుగా సస్పెన్స్ సాగింది. కొన్ని రూమర్లు కూడా వచ్చాయి. అయితే, కన్నప్పలో రుద్రగా ప్రభాస్ కనిపించనున్నారని ఇప్పుడు ఫస్ట్ లుక్‍తో క్లారిటీ వచ్చేసింది.
కన్నప్ప మూవీని ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో శివుడి భక్తుడు కన్నప్పగా మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివపార్వతుల్లా కనిపించనున్నారు. మలయాళ స్టార్ మోహన్‍లాల్, మంచు మోహన్ బాబు, శరత్ కుమార్ ఇలా స్టార్ తారాగణం ఈ చిత్రంలో ఉంది. భారీ మల్టీస్టారర్ మూవీగా వస్తోంది.
కన్నప్ప చిత్రాన్ని దాదాపు రూ.100కోట్లకు పైగా బడ్జెట్‍తో మోహన్ బాబు ప్రొడ్యూజ్ చేశారని తెలుస్తోంది. మంచు ఫ్యామిలీ ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కన్నప్ప చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టీఫెన్ దేవాసీ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నారు.
సంబంధిత కథనం