Imanvi: ప్రభాస్ ఫౌజీ కంటే ముందు సుడిగాలి సుధీర్ సినిమాలో ఇమాన్వీకి ఆఫర్ - రిజెస్ట్ చేసిన బ్యూటీ
Imanvi: ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతోన్న హిస్టారికల్ యాక్షన్ లవ్‌స్టోరీ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది ఇమాన్వీ. ప్రభాస్ ముందే కంటే ముందు ఇమాన్వీకి సుడిగాలి సుధీర్ గోట్ మూవీలో అవకాశం వచ్చింది. కానీ ఈ సినిమాను ఇమాన్వీ రిజెక్ట్ చేసింది.
Imanvi: ప్రభాస్, డైరెక్టర్ హనురాఘవపూడి కాంబోలో తెరకెక్కుతోన్న ఫౌజీ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ. తొలుత ఈ మూవీలో కథానాయికగా పలువురు బాలీవుడ్‌తో పాటు దక్షిణాది కథానాయికల పేర్లు వినిపించాయి. కానీ వారందరిని కాదని ఇమాన్వీకి అవకాశం దక్కడం తెలుగు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ మూవీలో ఇమాన్వీ హీరోయిన్‌గా ఎంపిక కావడంతో సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ ఒక్కసారిగా భారీగా పెరిగిపోయింది.
ఇమాన్వీకి ఛాన్స్‌లు...
కాగా ప్రభాస్ మూవీ కంటే ముందు ఇమాన్వీకి హీరోయిన్‌గా తెలుగులో ఛాన్స్‌లు వచ్చాయట. వాటిలో సుడిగాలి సుధీర్ గోట్ మూవీ ఒకటి. కానీ గోట్ మూవీని రిజెక్ట్ చేసిన ఇమాన్వీ...ప్రభాస్ సినిమాను అంగీకరించింది.
ఇన్‌స్టాగ్రామ్ రీల్ చూసి...
గోట్ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్న సుడిగాలి సుధీర్...ఇమాన్వీ ఇన్‌స్టాగ్రామ్ రీల్ చూసి ఇంప్రెస్ అయిపోయాడటా. ఇమాన్వీని తన సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని ఫిక్సైపోయి చాలా ట్రై చేశాడట. కానీ ఇమాన్వీ మాత్రం సుడిగాలి సుధీర్ సినిమా చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదట.
దాంతో ఇమాన్వీ స్థానంలో మరో హీరోయిన్‌ను గోట్ టీమ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇమాన్వీ గోట్ సినిమాను రిజెక్ట్ చేసిన విషయాన్ని సుడిగాలి సుధీర్ ఫ్రెండ్, టాలీవుడ్ కమెడియన్ గెటప్ శ్రీను రివీల్ చేశాడు. ఇమాన్వీ ప్రభాస్ సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన విషయం విని తనతో పాటు సుడిగాలి సుధీర్ కూడా షాకయ్యాడని గెటప్ శీను అన్నాడు.
హిస్టారికల్ యాక్షన్ లవ్ స్టోరీ...
1940 బ్యాక్‌డ్రాప్‌లో హిస్టారికల్ యాక్షన్ లవ్‌స్టోరీగా ప్రభాస్ మూవీని తెరకెక్కుతోన్నాడు డైరెక్టర్ హనురాఘవపూడి. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తితో పాటు జయప్రద ఓ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
కోటి రెమ్యునరేషన్...
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. ఫౌజీ కోసం ఇమాన్వీ కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఫౌజీ సెట్స్‌లోకి త్వరలోనే ప్రభాస్ అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం.
ఐదు సినిమాలు...
ప్రస్తుతం ప్రభాస్ ఐదు సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోగా కొనసాగుతోన్నాడు. ఫౌజీతో పాటు రాజాసాబ్, కల్కి 2, సలార్ 2 సినిమాలు చేస్తోన్నాడు. యానిమల్ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాను అంగీకరించాడు ప్రభాస్.