Wake Up Team Salaar : సలార్ టీమ్ మేలుకో.. అప్డేట్ ఇచ్చుకో.. ట్విట్టర్ ఎక్కిన ప్రభాస్ ఫ్యాన్స్
Wake Up Team Salaar : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో విడుదల కానుంది. దీంతో అప్డేట్ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్ వాల్ ఎక్కారు.
బాహుబలి తర్వాత వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నాడు ప్రభాస్(Prabhas). ఇటీవల విడుదలైన ఆదిపురుష్ సినిమా(Adipurush Cinema) అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో సలార్, కల్కి ఏడీ2898 సినిమాపై హోప్స్ పెట్టుకున్నాడు. ఇటు డార్లింగ్ ఫ్యాన్స్ కూడా సలార్ సినిమాల కోసం ఎదురచూస్తున్నారు. విడుదలకు దగ్గర పడుతోంది. దీంతో సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదేంటని ట్విట్టర్లో రచ్చ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. సెప్టెంబర్ 28న సలార్ చిత్రం విడుదల కానుంది. దీంతో ఫ్యాన్స్ గరం గరంగా ఉన్నారు.
#WakeUpTeamSALAAR.. Release SALAAR First Song అంటూ ట్వీట్ల మోత మోగిస్తున్నారు. ఇండియాలోనే సలార్ టీమ్ వేకప్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేశారు. ఇటీవలే సలార్ సినిమా(Salaar Cinema)కు సంబంధించి.. గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ లుక్స్ అదరగొట్టాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం దీంతో సరిపెట్టుకోలేదు. సలార్ ఫస్ట్ సాంగ్(Salaar Fitst Song) విడుదల చేయాల్సిందేనని పట్టుబట్టారు. ట్విట్టర్లోకి వెళ్లి ట్రెండింగ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ రిక్వెస్ట్ చూసైనా.. సలార్ టీమ్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందో లేదో చూడాలి.
ఇప్పటికే సలార్ సినిమా రికార్డులు సృష్టించింది. టీజర్ జూలై 6న విడుదలై చాలా రోజులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ట్రెండింగ్ లోనే ఉంది. ఇటు ప్రభాస్, అటు దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సహజంగానే వీరిద్దరి కాంబినేషన్ అనడంతో బాగా హైప్ క్రియేట్ అయింది. ప్రభాస్ మళ్లీ ట్రాక్‌లోకి రావాలంటే పెద్ద బ్రేక్ కావాల్సి ఉంది. సలార్‌తో ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తాడని భావిస్తున్నారు.
సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే కేజీఎఫ్ 2(KGF 2), సలార్ సినిమాకు కనెక్షన్ ఉందని అంటున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్, రామచంద్రరాజు, మధు గురుస్వామి, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, తిను ఆనంద్ తదితరులు నటిస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం సమకూరుస్తుండగా, భువన్ గౌడ కెమెరా వర్క్ చేశారు. 200 కోట్ల బడ్జెట్‌తో హోంబలే ఫిలింస్ విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా ఓటీటీ హక్కులు కూడా భారీ మెుత్తంలో అమ్ముడుపోయాయని టాక్. సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంత చేసుకుందని అంటున్నారు. భారీ మొత్తంలో రూ. 200 కోట్లకు కొనుగోలు చేసిందట. ఇప్పటి వరకూ ఇదే రికార్డుగా ఉంది. OTT హక్కులను పొందిందనే దాని గురించి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, అమెజాన్ ప్రైమ్ వీడియో సలార్ కొనుగోలు చేసిందని బజ్ క్రియేట్ అయింది.