Thaman on Prabhas: ప్రభాస్ చాలా కాలం తర్వాత అలా: అదిరిపోయే విషయాలు చెప్పిన థమన్.. ఫ్యాన్స్ ఖుషి-prabhas coming with mass songs after the long time in the raja saab says music director ss thaman ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thaman On Prabhas: ప్రభాస్ చాలా కాలం తర్వాత అలా: అదిరిపోయే విషయాలు చెప్పిన థమన్.. ఫ్యాన్స్ ఖుషి

Thaman on Prabhas: ప్రభాస్ చాలా కాలం తర్వాత అలా: అదిరిపోయే విషయాలు చెప్పిన థమన్.. ఫ్యాన్స్ ఖుషి

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 08, 2025 10:46 AM IST

Thaman on Prabhas: ది రాజాసాబ్ పాటల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్. పాటలు ఎలా ఉండనున్నాయో వివరించారు. థమన్ మాటలతో ప్రభాస్ అభిమానుల్లో ఎగ్జైట్‍మెంట్ మరింత పెరిగిపోయింది. థమన్ ఏం చెప్పారంటే..

Thaman on Prabhas: ప్రభాస్ చాలా కాలం తర్వాత అలా: అదిరిపోయే విషయాలు చెప్పిన థమన్.. ఫ్యాన్స్ ఖుషి
Thaman on Prabhas: ప్రభాస్ చాలా కాలం తర్వాత అలా: అదిరిపోయే విషయాలు చెప్పిన థమన్.. ఫ్యాన్స్ ఖుషి

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ చిత్రం చేస్తున్నారు. ఈ హారర్ కామెడీ రొమాంటిక్ సినిమాకు మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. తొలిసారి హారర్ జానర్‌లో ప్రభాస్ చేస్తుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. అలాగే, ఈ చిత్రంలో వింటేజ్ ప్రభాస్‍ను చూస్తారని, ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనింగ్ రోల్‍గా ఉంటుందనే అంచనాలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. తాజాగా ది రాజాసాబ్ చిత్రం గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మరిన్ని విషయాలు చెప్పారు. ఈ మూవీలో పాటల గురించి ఆయన చెప్పిన విషయాలు ప్రభాస్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని, మూవీపై ఆత్రుతను పెంచేశాయి.

yearly horoscope entry point

మాస్ పాటల్లో ప్రభాస్.. ఐటమ్ సాంగ్ కూడా..

చాలా కాలం తర్వాత మాస్ పాటల్లో ప్రభాస్ కనిపించనున్నారని థమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఐటమ్ సాంగ్, ముగ్గురు హీరోయిన్లతో ఒక పాట ఇలా ది రాజా సాబ్‍లో సాంగ్స్ అదిరిపోతాయయని అన్నారు. “చాలా కాలం తర్వాత ప్రభాస్.. మాస్ పాటలతో వస్తున్నారు. ఒక హీరోయిన్‍తో డ్యుయెట్.. ఒక ఐటమ్ సాంగ్, లాస్ట్ ముగ్గురు హీరోయిన్లతో ఒక పాట. ఓపెనింగ్ ఇంట్రడక్షన్ సాంగ్. ఇంకా రాజాసాబ్ ప్రపంచానికి ఓ థీమ్. సినిమాపై ఎవరికీ ఎక్కువ హైప్ లేదు. మాకు అదే కావాలి. అంచనాలు ఎంత తక్కువ ఉంటే ఒక్క పాట రిలీజ్ అయ్యే సరికి అంత వావ్ అనిపిస్తుంది” అని థమన్ చెప్పారు.

జపాన్ వెర్షన్ చేయమంటున్నారు

ది రాజాసాబ్ మూవీకి జపాన్ వెర్షన్ పాటలు చేయాలని అడుగుతున్నారని థమన్ వెల్లడించారు. “మన నటులే చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళుతున్నారు. ప్రభాస్‍ ది రాజా సాబ్ రిలీజ్ కానుంది. జపాన్‍లో కూడా ఆడియో లాంచ్ జరుగుతుంది. జపాన్ వెర్షన్ కూడా చేయాలని అంటున్నారు” అని థమన్ అన్నారు.

థమన్ చెప్పిన విషయాలతో ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ప్రభాస్‍ను మళ్లీ మాస్ పాటల్లో చూడనున్నామంటూ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మెగాపవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీకి థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా మరో రెండు రోజుల్లో జనవరి 10వ తేదీన రిలీజ్ కానుంది. ఈ తరుణంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు థమన్. ఇతర ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ది రాజా సాబ్ గురించి ఈ విషయాలు వెల్లడించారు.

ది రాజా సాబ్ చిత్రాన్ని ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రభాస్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వీడియో అదిరిపోయాయి. రెండు గెటప్‍ల్లో ప్రభాస్ లుక్స్ వచ్చాయి. ఈ మూవీలో ఆయన డ్యుయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఇప్పటి వరకు మిడ్‍రేండ్ చిత్రాలే చేసిన డైరెక్టర్ మారుతీకి ది రాజా సాబ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఈ చిత్రం తప్పకుండా అదిరిపోతుందని ఇప్పటికే కొన్ని సందర్భాల్లో మారుతీ వెల్లడించారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నయనతార క్యామియో రోల్ చేస్తారని సమాచారం. ఈ మూవీ అప్‍డేట్ల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం