Prabhas Bujji Video: ఆరు టన్నుల అద్భుతం.. ప్రభాస్ బుజ్జి దగ్గర నుంచి ఎలా ఉందో చూస్తారా?-prabhas bujji kalki 2898 ad makers mahindra company creates this indias biggest 6 tonne car ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Bujji Video: ఆరు టన్నుల అద్భుతం.. ప్రభాస్ బుజ్జి దగ్గర నుంచి ఎలా ఉందో చూస్తారా?

Prabhas Bujji Video: ఆరు టన్నుల అద్భుతం.. ప్రభాస్ బుజ్జి దగ్గర నుంచి ఎలా ఉందో చూస్తారా?

Hari Prasad S HT Telugu
May 23, 2024 10:23 PM IST

Prabhas Bujji Video: కల్కి 2898 ఏడీ మూవీ కోసం బుజ్జి పేరుతో ప్రభాస్ నడిపే ఓ రొబోటిక్ కారును మేకర్స్ పరిచయం చేసిన విషయం తెలుసు కదా. ఇండియాలోనే అతిపెద్దదైన ఈ ఆరు టన్నుల అద్భుతం ఎలా ఉందో చూస్తారా?

ఆరు టన్నుల అద్భుతం.. ప్రభాస్ బుజ్జి దగ్గర నుంచి ఎలా ఉందో చూస్తారా?
ఆరు టన్నుల అద్భుతం.. ప్రభాస్ బుజ్జి దగ్గర నుంచి ఎలా ఉందో చూస్తారా?

Prabhas Bujji Video: ప్రభాస్ బుజ్జి గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. మొదట ఓ మనిషి, అందులోనూ ప్రభాస్ కాబోయే భార్య అనుకొని పొరబడిన ఫ్యాన్స్.. తర్వాత ఇదొక కారు అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఈ కారును మేకర్స్ పరిచయం చేసిన తర్వాత ఈ బుజ్జి గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇండియాలోనే అతి పెద్దదైన ఈ కారు గురించి మరిన్ని విశేషాలు చూడండి.

ప్రభాస్ బుజ్జి.. ఆరు టన్నుల అద్భుతం

కల్కి 2898 ఏడీ మూవీ కోసం ప్రత్యేకంగా నిర్మించిన కారు ఈ బుజ్జి. ఇది ఇండియాలోనే అతిపెద్దదిగా చెబుతున్నారు. ఈ మాన్‌స్టర్ కారు బరువు ఆరు టన్నులు కావడం విశేషం. స్టార్ స్టార్ రెబల్ స్టార్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఈ కారును దగ్గర నుంచి చూపించే వీడియోను పోస్ట్ చేసింది. రేణుకా కృపలానీ అనే వ్యక్తి ఈ కారు ప్రత్యేకతల గురించి వివరించడం అందులో చూడొచ్చు.

ఓ సినిమా కోసం ఇలాంటి కారును నిర్మించడం నమ్మశక్యం కాదు.. దీనిని దగ్గర నుంచి చూస్తుంటే భవిష్యత్తు నుంచి వచ్చినట్లుగానే కనిపిస్తోంది.. ఈ కారు ముందు టైరు నా భుజం వరకు ఉంది అని ఆమె వివరిస్తూ వెళ్లింది. ఈ కారు ముందు టైరు రిమ్ సైజు 34.5 అంగుళాలు. ఈ కారు పొడవు 607.5 సెం.మీ., వెడల్పు 338 సెం.మీ., ఎత్తు 218.6 సెం.మీ.లు కావడం విశేషం. మొత్తంగా కారు బరువు 6 టన్నులు.

ఈ కల్కి 2898 ఏడీ మూవీలో ఈ కారును భైరవ పాత్రే సొంతంగా తన చేతులతో ఈ కారును తయారు చేసినట్లుగా చూపించినట్లు కూడా ఈ వీడియోలో చెప్పడం చూడొచ్చు. కారు వెనుక భాగంలోని ఛాంబర్ లో హీరో తాను బంధించిన వారిని ఉంచేందుకు వాడతారట. ఇక ఈ కారు వెనుక భాగంలో చాలా పెద్దగా ఉన్న ఒకే టైరు ఉంది. దీని సాయంతోనే ఈ కారు ఎటు కావాలంటే అటు వెళ్తుంది.

మహీంద్రా సాయంతో కారు తయారీ..

అంతకుముందు మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఈ కారు తయారీలో తమ పాత్ర గురించి ఓ ట్వీట్ లో వెల్లడించాడు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కోరిక మేరకు తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఉన్న జయం మోటార్స్ ఈ కారు తయారీలో మేకర్స్ కు సాయం చేసింది. కల్కి 2898 ఏడీ మూవీలో ప్రభాస్ వాడే కారు ఇది.

బుధవారం (మే 22) రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈవెంట్లో బుజ్జి అనే ఈ కారును పరిచయం చేశారు. ఈ కారు నడుపుతూనే ప్రభాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడికి వచ్చే సమయంలో ఈ కారు చేసిన సౌండ్ గుండెల్లో దడ పుట్టించేలా ఉంది. కల్కి మూవీ కోసం ఈ కారు ఒక్కటే కాదు.. ఎన్నో కొత్త కొత్త ఆయుధాలను కూడా తయారు చేసినట్లు నాగ్ అశ్విన్ గతంలోనే చెప్పాడు.

టీ20 వరల్డ్ కప్ 2024