Adipurush New Poster: ప్ర‌భాస్ బ‌ర్త్‌డే స్పెష‌ల్ - ఆదిపురుష్ కొత్త పోస్ట‌ర్ రిలీజ్‌-prabhas birthday adipurush new poster unveiled ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adipurush New Poster: ప్ర‌భాస్ బ‌ర్త్‌డే స్పెష‌ల్ - ఆదిపురుష్ కొత్త పోస్ట‌ర్ రిలీజ్‌

Adipurush New Poster: ప్ర‌భాస్ బ‌ర్త్‌డే స్పెష‌ల్ - ఆదిపురుష్ కొత్త పోస్ట‌ర్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 23, 2022 08:19 AM IST

Adipurush New Poster: ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను అందించింది ఆదిపురుష్ యూనిట్‌. ఆ గిఫ్ట్ ఏదంటే...

ప్ర‌భాస్
ప్ర‌భాస్

Adipurush New Poster: ప్ర‌భాస్ (Prabhas) పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆదివారం అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది ఆదిపురుష్ యూనిట్‌. కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రాముడిగా ప్ర‌భాస్ లుక్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ పోస్ట‌ర్‌లో బాణాన్ని సంధించ‌డానికి సిద్ధ‌మ‌వుతోన్న‌ట్లుగా ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో ప్ర‌భాస్ క‌నిపిస్తున్నారు.

రామాయ‌ణ గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. చెడుకు ప్ర‌తీక‌గా నిలిచిన రావ‌ణుడిపై రాముడు సాగించిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించారు. మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో పాటు త్రీడీ, ఐమాక్స్ వెర్ష‌న్స్‌లో దాదాపు ఐదు వంద‌ల కోట్ల వ్య‌యంతో ఆదిపురుష్ సినిమా రూపొందుతోంది.

ఇందులో జాన‌కిగా కృతిస‌న‌న్ (Krithi sanon) న‌టిస్తోంది. రావ‌ణుడిగా సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌బోతున్నాడు. ఈ నెల ప్రారంభంలో అయోధ్యలో ఈ సినిమా టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులోని విజువ‌ల్స్‌, ప్ర‌భాస్, సైఫ్ అలీఖాన్ లుక్స్‌పై చాలా విమ‌ర్శ‌లొచ్చాయి. ఈ సినిమాపై ప‌లు హిందుత్వ సంఘాల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ పిలుపుఇచ్చారు. త్రీడీ టీజ‌ర్‌తో ఈ విమ‌ర్శ‌ల తాకిడికి కొంత వ‌ర‌కు అడ్డుక‌ట్ట వేసింది చిత్ర యూనిట్‌. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న ఆది పురుష్ రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

Whats_app_banner