Prabhas at Kannapa sets: కన్నప్ప సెట్స్‌లో అడుగుపెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్.. భారీ ప్రాజెక్టులో మరో స్టార్
Prabhas at Kannapa sets: కన్నప్ప మూవీ షూటింగ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ చేరాడు. ఇప్పటికే ఎంతో మంది స్టార్లు ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా.. ఇప్పుడీ పాన్ ఇండియా హీరో కూడా చేరడం విశేషం.
Prabhas at Kannapa sets: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కన్నప్పలో చేరాడు. గురువారం (మే 9) నుంచి అతడు ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్ లాంటి వాళ్లు తమ షూటింగ్ పూర్తి చేసుకున్నారు.
కన్నప్ప సెట్స్‌లో ప్రభాస్
కన్నప్ప మూవీలో ప్రభాస్ కూడా నటించబోతున్నాడని చాలా రోజుల కిందటే వార్తలు వచ్చిన సంగతి తెలుసు కదా. ఇక ఇప్పుడతడు అధికారికంగా ఈ మూవీ సెట్ లో అడుగుపెట్టాడు. గురువారం (మే 9) నుంచి కన్నప్ప షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటున్నాడు. ఈ మూవీలో అతని పాత్ర ఏంటన్నదానిపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. అయితే అతనిది నందీశ్వరుడి పాత్ర అని తెలుస్తోంది.
కన్నప్ప మూవీ కోసం ప్రభాస్ మూడు రోజుల సమయం కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూడు రోజుల్లోనే మేకర్స్ ప్రభాస్ కు సంబంధించిన సీన్లను తెరకెక్కించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటించనున్నట్లు సమాచారం. అతడు ఈ మధ్యే హైదరాబాద్ వచ్చిన షూటింగ్ లో పాల్గొన్నాడు. శివుడి భక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో కన్నప్పగా మంచు విష్ణు నటిస్తున్నాడు.
ఓ పెద్ద బ్రేక్ కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న విష్ణు.. ఈ పాన్ ఇండియా మూవీ కన్నప్పపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. అందుకు తగినట్లే భారీ బడ్జెట్, భారీ తారాగణంతో మూవీ రిలీజ్ కు ముందే ఆసక్తి రేపుతోంది. సౌత్ ఇండస్ట్రీలోని స్టార్లతోపాటు అక్షయ్ కుమార్ రూపంలో బాలీవుడ్ స్టార్ హీరో కూడా ఈ సినిమాలో కనిపించనున్నాడు.
ఈ సినిమా కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీ సహా అద్భుతమైన టీమ్ పని చేస్తోంది. మంచు మోహన్ బాబు, విష్ణులే ఈ కన్నప్ప మూవీని నిర్మిస్తున్నారు. దీంతో ఈ తండ్రీకొడుకులకు మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది.
ప్రభాస్ బిజీ బిజీ
మరోవైపు ప్రభాస్ వరుస షూటింగ్ లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. గతేడాది అతని సినిమాలు ఆదిపురుష్, సలార్ రిలీజ్ కాగా.. ఈ ఏడాది జూన్ 27న కల్కి 2898 ఏడీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
నిజానికి ఈరోజే (మే 9) సినిమా వస్తుందని మొదట్లో మేకర్స్ చెప్పినా.. ఎన్నికల కారణంగా రిలీజ్ వాయిదా వేశారు. ఇక ఈ కల్కితోపాటు రాజా సాబ్, కన్నప్ప, సలార్ 2, స్పిరిట్ లాంటి సినిమాలతో ఈ ఏడాది ప్రభాస్ అసలు తీరిక లేకుండా గడపనున్నాడు.
సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఫెయిల్యూర్ తర్వాత సలార్ హిట్ తో మళ్లీ గాడిలో పడిన ప్రభాస్.. ఇప్పుడు కల్కి 2898 ఏడీ, సలార్ 2, రాజా సాబ్ లాంటి సినిమాలతో ఆసక్తి రేపుతున్నాడు.