Kamal Haasan - Prabhas: ‘నా అదృష్టం’: కమల్ హాసన్‍కు ప్రభాస్ విషెస్.. ‘కల్కి 2898 ఏడీ’ టీమ్ కూడా..
Kamal Haasan - Prabhas: సీనియర్ హీరో కమల్ హాసన్‍కు స్టార్ హీరో ప్రభాస్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కలిసి నటిస్తుండడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఆ వివరాలివే..
Kamal Haasan - Prabhas: సీనియర్ హీరో, వైవిధ్య నటుడు, లోకనాయకుడు కమల్ హాసన్.. నేడు (నవంబర్ 7) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 69వ సంవత్సరంలోకి ఆయన అడుగుపెట్టారు. దీంతో ఆయనకు సినీ ఇండస్ట్రీల నుంచి చాలా మంది ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కమల్ అద్భుతమైన నటుడే కాక దర్శకుడు, కథా రచయిత, నిర్మాత, సింగర్, టీవీ ప్రెజెంటర్‌గానూ ప్రతిభ చూపుతున్నారు. కమల్ హాసన్‍కు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్, కమల్ కలిసి నటిస్తున్నారు.
కమల్ హాసన్‍తో కలిసి పని చేస్తుండడం తన అదృష్టమని ప్రభాస్ పేర్కొన్నారు. కమల్‍కు శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‍స్టాగ్రామ్‍లో స్టోరీ పోస్ట్ చేశారు ప్రభాస్. “నటుడు. దిగ్గజం.. ది ఐకాన్.. ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటే మేం పెరిగాం. హ్యాపీ బర్త్‌డే కమల్ హాసన్ సర్. మీతో కలిసి పని చేయడం నా అదృష్టం” అని ప్రభాస్ పోస్ట్ చేశారు.
కల్కి 2898 ఏడీ మూవీ టీమ్ కూడా కమల్ హాసన్‍కు విషెస్ చెప్పింది. అయితే, పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి కమల్ హాసన్ ఫస్ట్ లుక్‍ను రిలీజ్ చేస్తారని అంచనాలు వినిపించాయి. అయితే, లుక్‍ను వైజయంతి మూవీస్ ఇంకా వెల్లడించలేదు. విషెస్ చెప్పింది. “వన్ అండ్ ఓన్లీ, సినీ ప్రపంచ అద్భుతం ఉలగనాయగన్ కమల్ హాసన్‍కు పుట్టిన రోజు శుభాకాంక్షలు” అని వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది. కమల్ బ్యాక్‍గ్రౌండ్‍లో ఉన్న ఓ పోస్టర్ పోస్ట్ చేసింది.
మోహన్ లాల్, విక్టరీ వెంకటేశ్, దగ్గుబాటి రానా, జయం రవితో పాటు చాలా మంది నటీనటులు, దర్శకులు, టెక్నిషియన్లు కమల్ హాసన్‍కు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.
కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేషన్‍లో 36 ఏళ్ల తర్వాత ‘థగ్ లైఫ్’ సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో సోమవారమే (నవంబర్ 6) వచ్చింది. దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే, శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రం కూడా చేస్తున్నారు కమల్. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రో ఇటీవలే వచ్చింది. ఇక, గ్లోబల్ మూవీ కల్కి 2898 ఏడీ చిత్రంలోనూ కీలక పాత్ర చేస్తున్నారు కమల్ హాసన్.
సంబంధిత కథనం