Adipurush Postponed: సంక్రాంతి రేసు నుంచి ఆదిపురుష్ ఔట్ - స‌మ్మ‌ర్‌కు పోస్ట్‌పోన్‌-prabhas adipurush release postponed to summer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adipurush Postponed: సంక్రాంతి రేసు నుంచి ఆదిపురుష్ ఔట్ - స‌మ్మ‌ర్‌కు పోస్ట్‌పోన్‌

Adipurush Postponed: సంక్రాంతి రేసు నుంచి ఆదిపురుష్ ఔట్ - స‌మ్మ‌ర్‌కు పోస్ట్‌పోన్‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 31, 2022 06:18 AM IST

Adipurush Postponed: ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న ఆదిపురుష్ సినిమా సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకోవ‌డం దాదాపు ఖ‌రారైంది. స‌మ్మ‌ర్‌కు ఈ సినిమా పోస్ట్‌పోన్ అయిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌భాస్
ప్ర‌భాస్

Adipurush Postponed: ప్ర‌భాస్ (Prabhas) ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌. సంక్రాంతి రేసు నుంచి ఆదిపురుష్ త‌ప్పుకోవ‌డం దాదాపు ఖాయం అయ్యింది. ప్ర‌భాస్ హీరోగా రామాయ‌ణ గాథ ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ఆదిపురుష్‌. మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో దాదాపు ఐదు వంద‌ల కోట్ల వ్య‌యంతో రూపొందుతోన్న ఈ సినిమాకు ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు .

సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ చాలా రోజుల క్రిత‌మే అనౌన్స్ చేసింది. కానీ అనుకోకుండా సంక్రాంతి బ‌రిలో చిరంజీవి వాల్తేర్ వీర‌య్య‌, బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి సినిమాలు నిలిచాయి. వీటితో పాటుగా అఖిల్ ఏజెంట్‌, విజ‌య్ వార‌సుడు, అజిత్ తినువు సినిమాలు కూడా సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి.

అనూహ్యంగా భారీ సినిమాలు సంక్రాంతి రేసులోకి కావ‌డంతో ఆదిపురుష్ చిత్ర యూనిట్ రిలీజ్ విష‌యంలో వెన‌క్కి త‌గ్గిన‌ట్లు తెలిసింది. ఈ సినిమా బ‌డ్జెట్ దృష్ట్యా సోలో రిలీజ్ అయితేనే బెట‌ర్ అని భావించిన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిసింది. భారీ బ‌డ్జెట్ సినిమాల‌తో పోటీగా రిలీజ్ చేస్తే థియేట‌ర్స్ ప‌రంగా స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని భావిస్తూ ఈ సినిమాను స‌మ్మ‌ర్‌కు పోస్ట్‌పోన్ చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్లు చెబుతున్నారు.

ఈ పోస్ట్‌పోన్‌కు సంబంధించిన అఫీషియ‌ల్ న్యూస్ ఈ వారంలోనే వెల్ల‌డికానున్న‌ట్లు స‌మాచారం. అదే రోజు కొత్త రిలీజ్ డేట్‌ను రివీల్ చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. రామాయ‌ణ గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తున్నారు. రావ‌ణాసురుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌బోతున్నారు. జాన‌కి పాత్ర‌లో కృతిస‌న‌న్ న‌టిస్తోంది.

ఐమాక్స్‌తో పాటు త్రీడీ ఫార్మెట్‌లో ఆదిపురుష్ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు. అక్టోబ‌ర్ 2న అయోధ్య‌లో ఈ సినిమా టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. కానీ రాముడిగా ప్ర‌భాస్ లుక్‌తో పాటు సినిమా విజువ‌ల్స్‌, గ్రాఫిక్స్‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లొచ్చాయి. త్రీడీ టీజ‌ర్‌తో కొంత వ‌ర‌కు ఈ విమ‌ర్శ‌లు తాకిడి నుంచి త‌ప్పించుకోగ‌లిగారు చిత్ర యూనిట్. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

టీ20 వరల్డ్ కప్ 2024