Adipurush Postponed: ఆదిపురుష్ మ‌రోసారి వాయిదా ప‌డ‌నుందా?-prabhas adipurush release date once again postponed
Telugu News  /  Entertainment  /  Prabhas Adipurush Release Date Once Again Postponed
ఆదిపురుష్
ఆదిపురుష్

Adipurush Postponed: ఆదిపురుష్ మ‌రోసారి వాయిదా ప‌డ‌నుందా?

18 December 2022, 17:47 ISTHT Telugu Desk
18 December 2022, 17:47 IST

Adipurush Postponed:ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమా మ‌రోసారి వాయిదాప‌డ‌నున్న‌ట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. జూన్ నుంచి ఈ సినిమా మ‌రింత వెన‌క్కి వెళ్లే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

Adipurush Postponed:ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమా మ‌రోసారి వాయిదాప‌డ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను గ్రాఫిక్స్ ప‌నుల కార‌ణంగా జూన్ 16కు వాయిదావేశారు. అయితే జూన్ లో కూడా ఈ సినిమా రిలీజ్ కావ‌డం అనుమాన‌మేన‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. విజువ‌ల్ ఎఫెక్ట్ ప‌నులు జూన్‌లోగా పూర్త‌య్యే అవ‌కాశం లేద‌ని అంటున్నారు.

అవుట్ పుట్ విష‌యంలో రాజీప‌డ‌కూడ‌ద‌నే ఆలోచ‌న‌లో చిత్ర యూనిట్ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. అందుకే అదిపురుష్ జూన్ 16 నుంచి మ‌రింత వెన‌క్కి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. రామాయ‌ణ‌గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

అక్టోబ‌ర్ నెల‌లో ఈ సినిమా టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. అయితే టీజ‌ర్‌లో ప్ర‌భాస్‌, సైఫ్ అలీఖాన్ లుక్‌తో పాటు గ్రాఫిక్స్ విష‌యంలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లొచ్చాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ ప‌లువురు ప్ర‌క‌ట‌న‌లు చేశారు. త్రీడీ టీజ‌ర్ రిలీజ్ త‌ర్వాత ఈ విమ‌ర్శ‌లు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ్రాఫిక్స్‌, లుక్స్ విష‌యంలో త‌ప్పుల‌ను స‌రిదిద్దుకునేందుకు సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను చిత్ర యూనిట్ జూన్‌కు వాయిదావేసింది.

ఈ సినిమాలో జాన‌కిగా కృతిస‌న‌న్ న‌టిస్తోంది. రావ‌ణుడిగా సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌బోతున్నారు. దాదాపు ఐదు వంద‌ల కోట్ల వ్య‌యంతో మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీలో ఈ సినిమాలో రూపొందిస్తున్నారు. ఐమాక్స్ ఫార్మెట్‌లో ఆదిపురుష్ రిలీజ్‌కానుంది. తెలుగు, హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందిన ఆదిపురుష్‌ను త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో డ‌బ్ చేయ‌బోతున్నారు.