పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్.. వరుసగా రెండు భారీ హిట్‍లు సాధించారు. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన సలార్ సక్సెస్ అయింది. ఈ ఏడాది జూన్ 27వ తేదీన రిలీజ్ అయిన కల్కి 2898 ఏడీ చిత్రం భారీ కలెక్షన్లతో దూసుకెళుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన ఈ చిత్రం ఇప్పటికే రూ.1,100 కోట్ల కలెక్షన్లు దాటేసింది. ఇంకా జోరు కనబరుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీర్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేయనున్నారు.
మోస్ట్ వైలెంట్ మూవీ యానిమల్‍తో సందీప్ రెడ్డి వంగా గతేడాది బ్లాక్‍బస్టర్ కొట్టారు. తీవ్రమైన విమర్శలు వచ్చినా ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది. ప్రభాస్‍తో సందీప్ చేయబోయే సినిమా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో విపరీతంగా ఉంది. ఈ మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ నటిస్తారని సందీప్ ఇటీవలే చెప్పారు. అయితే, స్పిరిట్ చిత్రం గురించి ఓ క్రేజీ రూమర్ బయటికి వచ్చింది.
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేస్తారనే రూమర్ తాజాగా బయటికి వచ్చింది. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం స్పిరిట్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ కోసం ఆయన రెండు పాత్రలను రాశారట. ప్రభాస్ చేయనున్న ఓ క్యారెక్టర్ నెగెటివ్‍గా ఉండనుందని తెలుస్తోంది. మరో పాత్ర పాజిటివ్‍గా ఉండనుందని సమాచారం. అయితే, సందీప్ ఇప్పటికే చెప్పిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఈ రెండింట్లో ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
స్పిరిట్‍లో ప్రభాస్ డ్యుయల్ రోల్ అనే విషయంపై ప్రస్తుతానికి రూమర్లు వస్తున్నాయి. అఫీషియల్‍గా కన్ఫర్మేషన్ రాలేదు. త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీని తన మార్క్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సందీప్ ప్లాన్ చేస్తున్నారు.
స్పిరిట్ సినిమా షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్‌లో మొదలవుతుందని గతంలోనే సందీప్ రెడ్డి వంగా హింట్ ఇచ్చారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది.
ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమా చేస్తున్నారు. మారుతీ దర్శకత్వంలో ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో వింటేజ్ ప్రభాస్‍ను చూస్తారని ఇప్పటికే మేకర్స్ హింట్ ఇచ్చారు. ఈ చిత్రంలో యాక్షన్‍తో పాటు కామెడీ ఎలిమెంట్స్ ఉంటాయని, పక్కా ఎంటర్‌టైనర్‌గా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. షూటింగ్ ఈ ఏడాది చివర్లో ఫినిష్ అవుతుందని అంచనా. రాజాసాబ్ చిత్రీకరణ పూర్తయ్యాక స్పిరిట్‍కు వెళ్లనున్నాడు ప్రభాస్.
రాజాసాబ్ సినిమా నుంచి నేడు (జూలై 29) ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ రానుంది. సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు ఈ గ్లింప్స్ రిలీజ్ కానుంది. పింక్ కలర్ సూట్‍లో స్టైలిష్ లుక్‍తో ప్రభాస్ ఉన్న పోస్టర్‌తో గ్లింప్స్ టైమ్‍ను మేకర్స్ అనౌన్స్ చేశారు. రాజాసాబ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
టాపిక్