NBK and PSPK Power Finale 2: పార్టీ పెట్టే బదులు తెలుగుదేశంలో చేరొచ్చు కదా.. పవన్‌కు బాలయ్య సూటి ప్రశ్న? ఏమన్నారంటే?-power star pawan kalyan finale 2 episode with balakrishna streaming now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Power Star Pawan Kalyan Finale 2 Episode With Balakrishna Streaming Now

NBK and PSPK Power Finale 2: పార్టీ పెట్టే బదులు తెలుగుదేశంలో చేరొచ్చు కదా.. పవన్‌కు బాలయ్య సూటి ప్రశ్న? ఏమన్నారంటే?

అన్‌స్టాపబుల్ 2 ఫినాలే ఎపిసోడ్
అన్‌స్టాపబుల్ 2 ఫినాలే ఎపిసోడ్

NBK and PSPK Power Finale 2: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఫినాలే రెండో భాగం ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. పవన్ కల్యాణ్ పాల్గొన్న ఈ ఎపిసోడ్‌లో బాలయ్య ఆయనను పలు ఆసక్తికర ప్రశ్నలను అడిగారు.

NBK and PSPK Power Finale 2: నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్2లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌లోని మొదటి భాగం ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా రెండో ఎపిసోడ్ కూడా ప్రేక్షకుల ముందుకు అందుబాటులోకి వచ్చింది. ఇద్దరు తెలుగు సూపర్ స్టార్లు ఒకే వేదికపై కనిపించే సరికి ఆడియెన్స్‌కు రెండు కళ్లు చాలట్లేదు. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగంపై బజ్ తీవ్రంగా ఏర్పడింది. దీంతో అభిమానులు ఆత్రుతగా ఎదురుచూశారు. ఈ రెండో పార్ట్‌లోనూ బాలయ్య- పవన్ కల్యాణ్ ఆసక్తికర సంభాషణ జరిగింది. ముఖ్యంగా తన సోదరుడు చిరంజీవి నుంచి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? ఏం కాదు? అనే ప్రశ్నను సంధించారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ ప్రశ్న ఇప్పటికే ప్రోమోలో విపరీతంగా హల్చల్ చేయడంతో పవర్ స్టార్ దానికి ఏ సమాధానమిస్తారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. తాజాగా ఎపిసోడ్ టెలికాస్ట్ కావడంతో ప్రేక్షకులు ఆత్రుతగా చూస్తున్నారు. బాలయ్య అడిగిన ప్రశ్నకు పవర్ స్టార్ అదిరిపోయే సమాధానమిచ్చారు. తన సోదరుడు చిరంజీవి నుంచి కష్టపడే తత్వం నేర్చుకోవాలని అనుకుంటానని బదులిచ్చారు. అదే విధంగా చిరంజీవిని చూసి నేర్చుకోకూడదనే విషయం ఎవరైనా ఏదైనా అన్నా, విమర్శించినా స్పందించడానికి సంకోచించిస్తారని, అంత మంచితనం నా వల్ల కాదని పవర్ స్టార్ స్పష్టం చేశారు.

అనంతరం బాలకృష్ణ ఓటు బ్యాంక్ గురించి ప్రశ్నించారు. ఈ స్టేట్‌లో చాలా మంది నీకు ఫ్యాన్స్.. మరి ఆ ఫ్యాన్ బేస్ ఓటు బ్యాంకుగా ఎందుకు మారలేదంటారు? అనే ప్రశ్నను పవన్‌ను అడుగ్గా.. ఇందుకు రెండు విషయాలు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల్లో ఎవరిదైనా నమ్మకాన్ని అంత సులభంగా పొందలేమని తెలిపారు. ఇందుకోసం చాలా కృషి చేయాలని, సమయం పడుతుందని స్పష్టం చేశారు. అలాగే ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలంటే ఏ రంగంలోనైనా నిలుచోవాలని పవన్ అభిప్రాయపడ్డారు.

ఈ ఎపిసోడ్‌లో మరిన్ని రాజకీయపరమైన ప్రశ్నలు సంధించారు బాలయ్య. ముఖ్యంగా వైజాక్ ఘటన, కారు ఎక్కి వెళ్లిపోవడం, పార్టీ పెట్టే బదులు తెలుగుదేశంలోనే ఉండిపోవచ్చు కదా? అనే ప్రశ్నలను అడిగారు. ఇందుకు పవన్ స్పందిస్తూ.. తనకంటూ కొన్ని మూల సిద్ధాంతాలున్నాయని, అధికారం అందరికీ అందాలన్నా, సాధికారిత రావాలన్నా తానే సొంతంగా పార్టీ పెడితే మంచిదని భావించినానని తెలిపారు. అందుకే తను ఏ పార్టీలోనూ ఇమడలేనని అర్థమైపోయిందని, ఒకవేళ జాయిన్ ఉంటే ఎంతవరకు తన భావాలను ముందుకు తీసుకెళ్తానో తెలియదని స్పష్టం చేశారు. ఈ కారణంగా సొంతంగా పార్టీ పెట్టినట్లు తెలిపారు.

ఈ ఎపిసోడ్‌లో మరో కొసమెరుపు దర్శకుడు క్రిష్ ఎంట్రీ. ఈ ఎపిసోడ్ నుంచి త్రివిక్రమ్ ఎందుకు తప్పించుకున్నాడో క్రిష్ తెలిపారు. అలాగే హరి హర వీర మల్లు ఆలస్యం గురించి కూడా మాట్లాడారు. క్రిష్‌తో క్విజ్ రౌండు ఆసక్తికరంగా సాగింది. ఆ తర్వాత బాలయ్య తొడ చరచడం, ట్రైన్ రివర్స్ వెళ్లే ప్రస్తావన ఫన్నీగా అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఇలాచేస్తే ట్రోల్స్‌ అన్నీ తనవైపే ఉండేవని బాలయ్య ఒప్పుకున్నారు. ఇవి కాకుండా పవన్ తను ఆత్మహత్య చేసుకోవాలనుకోడానికి గల కారణాన్ని కూడా చెప్పారు. ఇలా ఈ ఎపిసోడ్‌లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ స్టార్లు ఇద్దరూ మాట్లాడుకున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఎపిసోడ్ రెండో పార్ట్ పొలిటికల్, ఎమోషనల్, ఫన్నీ అంశాల సమ్మేళనంగా సాగింది.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.