Pawan Kalyan Movie Release date: జులైలో మామ-అల్లుళ్లు వచ్చేస్తున్నారు.. రిలీజ్ డేట్ ఫిక్స్-power star pawan kalyan and supreme hero sai dharam tej movie arriving on 28th july ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Power Star Pawan Kalyan And Supreme Hero Sai Dharam Tej Movie Arriving On 28th July

Pawan Kalyan Movie Release date: జులైలో మామ-అల్లుళ్లు వచ్చేస్తున్నారు.. రిలీజ్ డేట్ ఫిక్స్

Maragani Govardhan HT Telugu
Mar 24, 2023 05:00 PM IST

Pawan Kalyan Movie Release date: పవర్ స్టార్ పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జులైలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్
పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్

Pawan Kalyan Movie Release date: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి మూవీ వస్తుందంటేనే అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఎప్పుడూ సినిమాకు బాగా గ్యాప్ తీసుకునే పవన్.. గత రెండేళ్లుగా పుల్ స్పీడు పెంచారు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే సుజీత్‌తో ఓ సినిమా సముద్రఖని దర్శకత్వంలో మరో చిత్రాన్ని ప్రారంభించారు. సముద్రఖనితో రూపొందిస్తున్న సినిమాలో తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దీంతో మెగా అభిమానుల్లో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. పవన్-సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది జులైలో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టును పెట్టారు. "పవర్ స్టార్-సుప్రీం హీరో సినిమాను 2023 జులైలో విడుదల చేస్తున్నాం" అంటూ పోస్టు పెట్టారు.

ఈ సినిమా గతేడాది తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదాయ సీతమ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోంది. మాతృకను తెరకెక్కించిన సముద్రఖనినే దీన్ని కూడా రూపొందిస్తున్నారు. దీంతో ఈ మూవీ రీమేక్ విషయంలోనూ దర్శకుడు చాలా క్లారిటీగా ఉన్నాడు. వీకెండ్స్, ఆదివారాలు కూడా వదలకుండా దూకుడుగా షూటింగ్ చేస్తున్నారు.

జీ స్టూడియోస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ రచన చేశారు. పవన్ కల్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

IPL_Entry_Point