Pothugadda OTT Release Date: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో తెలుగు యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్
Pothugadda OTT Release Date: ఓటీటీలోకి మరో తెలుగు యాక్షన్ డ్రామా నేరుగా వచ్చేస్తోంది. థియేటర్లలో కాకుండా ఈ మూవీని ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ తోపాటు స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేసింది.
Pothugadda OTT Release Date: మరో తెలుగు మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. రెండున్నర నెలల కిందటే ఈటీవీ విన్ ఓటీటీలోకి వస్తుందని భావించిన పోతుగడ్డ మూవీ.. మొత్తానికి ఈ నెలలోనే స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ తోపాటు స్ట్రీమింగ్ తేదీని శనివారం (జనవరి 18) ఈటీవీ విన్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

పోతుగడ్డ ఓటీటీ రిలీజ్ డేట్
తెలుగు యాక్షన్ డ్రామా పోతుగడ్డ. ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీగా తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ ను సోమవారం (జనవరి 20) రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీ జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. "మచ్ అవేటెడ్ పోతుగడ్డ ట్రైలర్ జనవరి 20న రిలీజ్ కానుంది. ఈ డ్రామాను చూడటానికి సిద్ధంగా ఉండండి. జనవరి 30 నుంచి పోతుగడ్డ ఎక్స్‌క్లూజివ్ గా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది" అనే క్యాప్షన్ తో ఈటీవీ విన్ శనివారం (జనవరి 18) తన ఎక్స్ అకౌంట్ ద్వారా తెలిపింది.
ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ పోస్ట్ చేసింది. పోతుగడ్డ మూవీ నిజానికి నవంబర్ 14నే రానుందని గతంలో ఈటీవీ విన్ వెల్లడించింది. అయితే మూవీ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది.
పోతుగడ్డ మూవీ గురించి..
పోతుగడ్డ మూవీని ఓ ప్రేమ కథ, ఓ రాజకీయ ఆట, సస్పెన్ష్ తో నిండిన యుద్ధంగా గతంలో ఈటీవీ విన్ అభివర్ణించింది. ఎ టేల్ ఆఫ్ లవ్ అనే ట్యాగ్ లైన్ తో ఈ పోతుగడ్డ మూవీ వస్తోంది. ఈ పోతుగడ్డ మూవీని రక్ష వీరన్ డైరెక్ట్ చేశాడు. అయితే చాలా వరకు ఈ సినిమాలో కొత్త వాళ్లే లీడ్ రోల్స్ చేశారు. శత్రు, ప్రశాంత్ కిశోర్ లాంటి వాళ్లు నటించారు. అనుపమ చంద్ర, శరత్ చంద్ర మూవీని ప్రొడ్యూస్ చేశారు.
శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్ అందించాడు. ఈ పోతుగడ్డ మూవీ ఆసక్తి రేపుతోంది. ఈటీవీ విన్ ఈ సినిమా డిజిటల్ హక్కులను చాలా తక్కువ మొత్తానికే సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలోకే వస్తుండటంతో ఈ పోతుగడ్డ మూవీని ప్రేక్షకులు ఆదరించే అవకాశాలు ఉన్నాయి.