Suvarna Sundari OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి పూర్ణ ‘సువర్ణ సుందరి’ సినిమా.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చిందంటే..
Suvarna Sundari OTT Streaming: సువర్ణ సుందరి సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టింది. థియేటర్లలో విడుదలైన ఏడాది తర్వాత స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో పూర్ణ, జయప్రద ప్రధాన పాత్రలు పోషించారు.
Suvarna Sundari OTT: నటి పూర్ణ, అలనాటి హీరోయిన్ జయప్రద, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన ‘సువర్ణ సుందరి’ చిత్రం గతేడాది ఫిబ్రవరి 3వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. సూపర్ నేచురల్ సోషియో ఫ్యాంటసీ మూవీగా ఈ చిత్రం వచ్చింది. వివిధ కాలాల మధ్య ఈ మూవీ స్టోరీ సాగుతుంది. సువర్ణ సుందరి చిత్రానికి సురేంద్ర మాదారపు దర్శకత్వం వహించారు. థియేటర్లలో పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
ఏడాది తర్వాత..
థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత సువర్ణ సుందరి చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగులో మాత్రమే ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.
అయితే, సువర్ణ సుందరి మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. రూ.79 రెంట్‍తో అడుగుపెట్టింది. అయితే, త్వరలోనే ఈ మూవీ ప్రైమ్ వీడియో సబ్‍స్క్రైబర్లందరికీ ఉచితంగా స్ట్రీమింగ్‍కు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే ఆ ఓటీటీలో రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చింది.
సువర్ణ సుందరి గురించి..
సువర్ణ సుందరి చిత్రంలో పూర్ణ, జయప్రదతో పాటు సాక్షి చౌదరి, సాయికుమార్, రామ్, ఇంద్ర, నాగినీడు, కోట శ్రీనివాసరావు కీలకపాత్రలు పోషించారు. సురేంద్ర మాదారపు దర్శకత్వం వహించిన ఈ మూవీని ఎం.ఎల్.లక్ష్మి నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు.
త్రినేత్రి విగ్రహం చుట్టూనే సువర్ణ సుందరి కథ తిరుగుతుంది. కొన్ని తరాలుగా ఈ విగ్రహం వల్ల ఎలాంటి పరిణామాలు జరిగాయన్నది ఈ చిత్రంలో ఉంటుంది. 15వ శతాబ్దం, 18వ శతాబ్దం,19వ శతాబ్దం, ప్రస్తుత కాలం.. ఇలా నాలుగు టైమ్‍లైన్ల మధ్య ఈ సినిమా సాగుతుంది. సస్పెన్స్ ఎలిమెంట్లు కూడా ఈ చిత్రంలో ఉన్నాయి. వీఎఫ్‍ఎక్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది.
సువర్ణ సుందరి చిత్రంలో రెండు పాత్రలు చేశారు పూర్ణ. ఆమె నటన మెప్పించింది. అలాగే, అలనాటి హీరోయిన్ జయప్రద చాలా కాలం తర్వాత తెలుగు మూవీ చేశారు. దీంతో ఈ చిత్రానికి మంచి హైప్ వచ్చింది. మోస్తరు టాక్ వచ్చినా.. ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా ఆడలేకపోయింది.
నరకాసుర మూవీ
నరకాసుర సినిమా కూడా ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. పలాస మూవీ ఫేమ్ రక్షిత్ అట్లూరి ఈ మూవీలో హీరోగా నటించారు. డిఫరెంట్ కాన్సెన్ట్‌తో ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సెబాస్టియన్ నావో అకోస్టా. ఈ చిత్రంలో అపర్ణా జనార్దన్, సంగీతా విపిన్, శత్రు, నాజర్, చరణ్ రాజ్, శ్రీమన్ కీరోల్స్ చేశారు. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత నరకాసుర సినిమా ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెంటల్ పద్ధతిలోనే స్ట్రీమింగ్ అవుతోంది. అజ్జా శ్రీనివాస్, కురుమారు రఘు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాఫర్ రాజా మ్యూజిక్ ఇచ్చారు.
టాపిక్