Happy Birthday Pooja Hegde: బుట్ట బొమ్మ బర్త్‌డే జరిపిన బాలీవుడ్ భాయ్‌జాన్.. వెంకీ మామ విషెస్-pooja hegde turned 32 today and her birthday celebrations with salman and venkatesh ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Pooja Hegde Turned 32 Today And Her Birthday Celebrations With Salman And Venkatesh

Happy Birthday Pooja Hegde: బుట్ట బొమ్మ బర్త్‌డే జరిపిన బాలీవుడ్ భాయ్‌జాన్.. వెంకీ మామ విషెస్

Maragani Govardhan HT Telugu
Oct 13, 2022 04:59 PM IST

Happy Birthday Pooja Hegde: టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే పుట్టిన రోజు వేడుకలు మూవీ సెట్స్‌లో జరిగాయి. కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్ అనే చిత్రంలో సల్మాన్, వెంకటేశ్‌తో కలిసి నటిస్తున్న పూజా పుట్టినరోజు ఈ మూవీ సెట్స్‌లో జరిగింది.

పూజా హెగ్డే పుట్టిన రోజు జరిపిన సల్మాన్-వెంకీమామ
పూజా హెగ్డే పుట్టిన రోజు జరిపిన సల్మాన్-వెంకీమామ

Happy Birthday Pooja Hegde: ముకుంద సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన పూజా హెగ్డే.. ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మధ్య మధ్యలో హిందీ, తమిళంలో నటించినప్పటికీ తెలుగులోనే అగ్రతారగా కొనసాగుతోంది. తనదైన నటన, అందంతో ప్రేక్షకులను అలరిస్తున్న మన బుట్టబొమ్మ నేటితో 32 ఏళ్లు పూర్తి చేసుకుని 33వ పడిలోకి అడుగుపెడుతోంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ బర్త్‌డే వేడుకను బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్.. విక్టరీ వెంకటేశ్ కలిసి జరిపారు.

సల్మాన్, వెంకటేష్ కలిసి కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పూజా హెగ్డే పుట్టిన రోజు వేడుకలను సల్మాన్, వెంకీ మామ సమక్షమంలో జరిగింది. వీరిద్దరూ పూజా చేత కేకును కట్ చేయించారు. అనంతరం ఆమెకు తినిపించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మేకర్స్ షేర్ చేశారు. పూజా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ జత చేశారు. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు.

"కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి నాకు నచ్చినవి చేస్తూ.. షూటింగ్ చేయడానికి ఇంతకంటే మంచి మార్గం ఉండదని నేను భావిస్తున్నాను. సెట్‌లో పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది." అని పూజా హెగ్డే స్పష్టం చేసింది.

యాక్షన్ ప్యాక్ ఎంటర్టైనర్‌గా కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్ చిత్రం తెరకెక్కుతోంది. సల్మాన్ ఖాన్ ఫిల్మ్ హౌస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంతో పాటు పూజా మరో బాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తోంది. రణ్‌వీర్ సింగ్ సరసన సర్కస్ చిత్రంలో నటిస్తోంది. తెలుగు త్రివిక్రమ్-మహేశ్ బాబు కాంబోలో రానున్న SSMB28లోనూ నటించనుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన చిత్రంలోనూ లైగర్ హీరో విజయ్ దేవరకొండతో పక్కన కథానాయికగా ఎంపికైంది. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు.

IPL_Entry_Point

సంబంధిత కథనం