Tollywood Heroines Next Movies: పూజాహెగ్డే, కృతిశెట్టి... నెక్స్ట్ ఏంటి - డైలమాలో టాలీవుడ్ కెరీర్?
Tollywood Heroines Next Movies: వరుస అవకాశాలతో లక్కీ స్టార్స్‌గా పేరుతోచ్చుకొన్న కొందరు హీరోయిన్లు టాలీవుడ్‌కు గ్యాప్ తీసుకుంటోన్నారు. ఈ అందాల నాయికల తదుపరి సినిమా ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఆ హీరోయిన్లు ఎవరంటే...
Tollywood Heroines Next Movies: ఒకప్పుడు ఏడాదికి రెండు, మూడు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన అందాల కథానాయికలు ప్రస్తుతం జోరు తగ్గించారు. తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. కొందరు పరాజయాల కారణంగా, మరికొందరు మనసుకు నచ్చిన కథలు దొరక్క టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చారు. ఆ హీరోయిన్లు ఎవరంటే…
టాలీవుడ్‌కు టాటా
ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నది కృతిశెట్టి. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో తెలుగులో కృతిశెట్టికి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఒకేసారి నాలుగైదు సినిమాల్ని అంగీకరించి ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించింది. కానీ ఈ సినిమాలన్ని ఒకదాటి తర్వాత మరొకటి వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో కృతిశెట్టి కెరీర్ డైలామాలో పడింది.
తనకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తుందని బోలేడు ఆశలు పెట్టుకున్న కస్టడీ కూడా డిజాస్టర్స్ జాబితాలో చేరింది. కస్టడీ తర్వాత తెలుగులో కొత్త సినిమాలేవి అంగీకరించలేదు కృతిశెట్టి. ఆమె నెక్స్ట్ సినిమా ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. తెలుగులో అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజెంట్ కృతిశెట్టి కోలీవుడ్, మాలీవుడ్‌లపై దృష్టిసారిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఒక్క సినిమా మాత్రమే...
టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో గోల్డెన్ గర్ల్‌గా చెలామణి అయిన పూజాహెగ్డేకు ప్రస్తుతం బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. ఒకప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా గడిపిన ఈ అమ్మడి చేతిలో ప్రజెంట్ మహేష్, త్రివిక్రమ్ మూవీ తప్ప మరో సినిమా లేదు. తెలుగుతో పాటు బాలీవుడ్‌లో పూజా హెగ్డే నటించిన సినిమాలు పరాజయాల్ని చవిచూడటం వల్లే పూజాహెగ్డేకుఅవకాశాల్ని తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. మహేష్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తర్వాత పూజాహెగ్డే తదుపరి సినిమా ఏమిటన్నది సస్పెన్స్‌గానే మారింది.
ఏడాదిపైనే…
సాయిపల్లవి టాలీవుడ్ స్క్రీన్‌పై కనిపించి ఏడాది దాటిపోయింది. డబ్బింగ్ సినిమా గార్గితో గత ఏడాది తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన సాయిపల్లవి ప్రస్తుతం టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది. మనసుకు నచ్చిన మంచి కథతోనే తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వాలనే యోచనలో ఫిదా బ్యూటీ ఉన్నట్లు సమాచారం.
సక్సెస్, ఫెయిల్యూర్స్‌కు అతీతంగా ఏడాదికి నాలుగైదు తెలుగు సినిమాలు చేస్తూ వచ్చిన రాశీఖన్నా 2023 మొదలై ఆరు నెలలు దాటినా ఇప్పటివరకు ఒక్క కొత్త సినిమాపై సంతకం చేయలేదు. కోలీవుడ్, బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన రాశీ టాలీవుడ్‌కు డిస్టెన్స్ పాటిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ కూడా గత రెండేళ్లుగా తెలుగులో సినిమా చేయలేదు. బాలీవుడ్‌లో వరుసగా సినిమాల్ని అనౌన్స్‌చేస్తోన్న రకుల్ తెలుగులో నెక్స్ట్ సినిమా ఏమిటన్నది ప్రకటించడం లేదు.
సక్సెస్ వచ్చినా…
దసరాతో టాలీవుడ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకొన్న కీర్తి సురేష్ కూడా ప్రస్తుతం భోళా శంకర్ మినహా తెలుగులో ఏ సినిమాను అంగీకరించలేదు. సక్సెస్ వచ్చినా తెలుగులో తదుపరి సినిమాను విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆసక్తికరంగా మారింది. వీరితో పాటు మరికొందరు కథానాయికలు కూడా తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు.