Pooja Hegde In Paiya Sequel: త‌మిళ సూప‌ర్ హిట్ మూవీ సీక్వెల్‌లో పూజాహెగ్డే-pooja hegde to play female lead in paiya sequel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Pooja Hegde To Play Female Lead In Paiya Sequel

Pooja Hegde In Paiya Sequel: త‌మిళ సూప‌ర్ హిట్ మూవీ సీక్వెల్‌లో పూజాహెగ్డే

Nelki Naresh Kumar HT Telugu
Feb 25, 2023 06:35 AM IST

Pooja Hegde In Paiya Sequel: కోలీవుడ్‌లో పూజాహెగ్డే ఓ క్రేజీ ఆఫ‌ర్‌ను అందుకున్న‌ట్లు స‌మాచారం. సూప‌ర్ హిట్ మూవీ సీక్వెల్‌లో ఆమె న‌టించ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఆ సీక్వెల్ ఏదంటే...

పూజాహెగ్డే
పూజాహెగ్డే

Pooja Hegde In Paiya Sequel: కార్తి, త‌మ‌న్నా జంట‌గా లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో 2010లో రూపొందిన అవారా(త‌మిళ మూవీ పైయ్యా) బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. మ్యూజిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు ప‌ద‌మూడేళ్ల త‌ర్వాత సీక్వెల్ రాబోతున్న‌ట్లు కోలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ సీక్వెల్‌లో ఆర్య హీరోగా న‌టిస్తుండ‌గా అత‌డికి జోడీగా పూజాహెగ్డేను క‌థానాయిక‌గా తీసుకున్న‌ట్లు స‌మాచారం. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత విజ‌య్ బీస్ట్ సినిమాతో గ‌త ఏడాది కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది పూజాహెగ్డే. బీస్ట్ త‌న‌కు విజ‌యాన్ని తెచ్చిపెడుతుంద‌ని భారీగానే ఆశ‌లు పెట్టుకున్న‌ది పూజాహెగ్డే. కానీ ఆ క‌ల మాత్రం తీర‌లేదు. అవారా సీక్వెల్‌తో మ‌రోసారి కోలీవుడ్‌లో త‌న ల‌క్‌ను ప‌రీక్షించుకోవ‌డానికి పూజాహెగ్డే సిద్ధ‌మ‌వుతోన్న‌ట్లు చెబుతున్నారు.

ఈ సీక్వెల్ కోసం జాన్వీ క‌పూర్‌తో పాటు మ‌రికొంద‌రు క‌థానాయిక‌ల పేర్ల‌ను ప‌రిశీలించిన లింగుసామి చివ‌ర‌కు పూజాహెగ్డేను హీరోయిన్‌గా ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ సీక్వెల్‌కు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ త్వ‌ర‌లోనే వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది.

కాగా ప్ర‌స్తుతం పూజాహెగ్డే తెలుగులో మ‌హేష్‌బాబు, - త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో స‌ల్మాన్‌ఖాన్‌తో కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమా చేస్తోంది పూజాహెగ్డే. ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈసినిమా ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.