Pooja Hegde: అల వైకుంఠపురంలో తమిళ సినిమా అట.. నోరు జారిన పూజాను ఆడుకుంటున్న నెటిజన్లు
Pooja Hegde: అల వైకుంఠపురంలో ఓ తమిళ మూవీ అంటూ నోరు జారి హీరోయిన్ పూజా హెగ్డేతో నెటిజన్లు ఆడుకుంటున్నారు. అల్లు అర్జున్ నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ విషయంలో నోరు జారిన పూజాపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.
Pooja Hegde: అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో మూవీ ఎంత పెద్ద హిట్టో తెలుసు కదా. సంక్రాంతి సినిమాగా వచ్చి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మూవీ ఇది. ఇందుల్లో అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది. కానీ ఇదో తెలుగు సినిమా అని ఆమె మరచిపోయింది. ఇది తమిళ సినిమా అంటూ ఓ ఇంటర్వ్యూలో నోరు జారడంతో ట్రోలింగ్ జరుగుతోంది.

అల వైకుంఠపురంలో తమిళ మూవీ అట
పూజా హెగ్డే ఈ మధ్య తెలుగు సినిమాలకు దూరమై తెలుగు వాళ్లను, మన సినిమాలను పూర్తిగా మరచిపోయినట్లుంది. అందుకే అల వైకుంఠపురంలోలాంటి హిట్ సినిమాను కూడా ఓ తమిళ సినిమా అంటూ ఆమె నోరు జారింది.
ఈ మధ్యే ఆమె హిందీలో షాహిద్ కపూర్ తో కలిసి దేవా మూవీలో నటించిన విషయం తెలుసు కదా. ఇందులో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూలో బిజీగా గడిపింది. అయితే అందులో ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా నోరు జారింది.
"అల వైకుంఠపురంలో ఓ తమిళ సినిమా. అదో పాన్ ఇండియా మూవీ కాదు. అయినా హిందీ ప్రేక్షకులు ఆదరించారు. అలాగే డీజే (దువ్వాడ జగన్నాథం)ని కూడా. కంటెంట్ బాగుంటే అది ప్రేక్షకుల దగ్గరికి చేరుతుంది" అని పూజా ఆ ఇంటర్వ్యూలో అనడం చాలా మందిని షాక్ కు గురి చేసింది.
తెలుగులో ఆమెకు దక్కిన అదిపెద్ద హిట్స్ లో ఈ అలవైకుంఠపురంలో కూడా ఒకటి. అలాంటి సినిమాను ఆమె తమిళ సినిమా అనడం అల్లు అర్జున్ ఫ్యాన్స్ తోపాటు తెలుగు సినిమా ప్రేక్షకులకు కూడా మింగుడు పడటం లేదు. దీంతో ఆ వీడియో వైరల్ అయినప్పటి నుంచీ ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉన్నారు.
పూజా హెగ్డే హాట్ కిస్
ఇక పూజా హెగ్డే ఈ దేవా మూవీలో షాహిద్ కపూర్ తో కలిసి ఓ లిప్ లాక్ సీన్లో నటించడం విశేషం. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలుగు సినిమాల్లో అందాల ఆరబోత తప్ప మరీ రెచ్చిపోయి హాట్ హాట్ కిస్సుల జోలికి ఆమె వెళ్లలేదు.
కానీ కొన్నాళ్లుగా పెద్దగా అవకాశాలు లేని ఆమె.. ఇప్పుడీ దేవా మూవీలో షాహిద్ కపూర్ తో హాట్ కిస్ కు సై అన్నట్లు తెలుస్తోంది. అయితే దేవా మూవీ కూడా పూజాకు పెద్దగా కలిసి రాలేదు. తొలి షో నుంచే నెగటివ్ రివ్యూలు రావడంతో మూవీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయింది.
సంబంధిత కథనం